పల్లలెట్ల రగులుతున్నయంటే.. బ్యాంకులపై దాడులు జరుగుతున్నాయి.. demonetisation effect: rural women attack banks in Andhra Pradesh

Demonetisation effect rural women attack banks in andhra pradesh

andhra pradesh, demonetisation, rural parts of India, banks, women, elderly persons, cultivation, Supreme court, chandrababu, PM Modi, Arun jaitley, RBI, reserve bank of india, ATM centers, big Queues

Even after 25 days of demonetisation, Queues at banks and ATM centres are increasing, indian rural parts are largely effected with this move, in andhra pradesh rural women attack banks.

పల్లలెట్ల రగులుతున్నయంటే.. బ్యాంకులపై దాడులు జరుగుతున్నాయి..

Posted: 12/03/2016 11:11 AM IST
Demonetisation effect rural women attack banks in andhra pradesh

పాత పెద్ద నోట్ల రద్దు విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం.. ఇందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నమోదైన పీటీషన్లను స్వీకరించే సమయంలో చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజమని తేలుతున్నాయి. అకస్మికంగా పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్లో అల్లర్లు జరగోచ్చు.. బ్యాంకులపై దాడులు కూడా చోటుచేసుకోవచ్చునన్న వ్యాఖ్యలు నిజమవుతున్నాయి.  పట్టణాలు, నగరాల సంగతి ఎలావున్నా.. పల్లె ప్రాంతాలు మాత్రం నగదు లేదన్న బ్యాంకుల సమాధానాలతో సంతృప్తి చెందడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో పల్లెలు రగిలిపోతున్నాయి. ఎప్పటికో, ఎవరికో జరిగే న్యాయన్యాయాల కోసం ఇప్పుడు మమల్ని ఇబ్బందులు పెడతారా.? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.

చూస్తుండగానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పాతిక రోజుల నిండాయి. వారు చెప్పిన కాలంలో సగం సమయం ముగిసినా.. ఎలాంటి తేడా కనిపించడం లేదు. అసలు యాభై రోజుల్లోపు పరిస్థితి మారక పోగా.. మా డబ్బు మేము తీసుకోవడానికి గంటల కోద్ది సమయం బ్యాంకులు, ఏటీయంల వద్ద క్యాలలో నిల్చోవాలా.. అవసరానికి డబ్బు లభిస్తుందో లేదోనన్న ఉత్కంఠకు గురికావాలా..? ఎందుకింత ప్రయాస పడాలి. కేంద్ర ప్రభుత్వం మమల్ని కూడా అవినీతి పరులుగా జమకుడుతుందా..? మరి మేమేందుకు ఇబ్బందులకు గురికావాలి..? ఇలాంటి ప్రశ్నలంటినీ నిన్న మొన్నటి వరకు పట్టణాలు, నగర ప్రాంతాల్లో ఏటీయం, కేంద్రాలు, బ్యాంకుల వద్ద క్యూలో నిల్చున్న పలువురు ప్రజలు అభిప్రాయం.

‘చాలా దూరం నుంచి వచ్చాను. వెయ్యి రూపాయలు ఇప్పించండి. మళ్లీ మళ్లీ రాలేను. మళ్లీ వచ్చేందుకు చార్జీలకు కూడా డబ్బులు లేవు.. మళ్లీ వచ్చి చెంతాడంత క్యూ లైన్లలో నిల్చోవాలంటే.. అరోగ్యం కూడా సహకరించదు దండంపెడతా.’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో వృద్ధులు, ‘కోతల కాలం. కుప్పలు కొట్టాలి. లేదంటే అరుగాలం పడించిన పంట చేతికందకుండా పోతుంది. డబ్బులు లేవంటే ఎలా?’ అంటూ గుంటూరు జిల్లాలో రైతులు, ‘బ్యాంకుల్లోనే డబ్బులు లేవంటే తమ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? ఏమైపోయింది?’ అంటూ కడప జిల్లాలో మహిళలు.. ఇలా రాష్ట్రమంతటా ప్రజలు రగిలిపోతున్నారు.

బ్యాంకుల చుట్టూ ఎన్ని పర్యాయాలు తిరగినా.. ఏటీమంల వద్ద ఎన్ని రోజులు నిల్చున్నా.. అవసరానికి డబ్బులు రాకపోడంతో మహిళల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నాళ్లీ పరిస్థితులు, ఎన్నేళీ దురవస్థలు అంటూ నిలదీస్తున్నారు. మా డబ్బును మా అవసరాలకు అడుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదు..? ఎందుకని ఆంక్షలు విధిస్తున్నారు.. పరమితులు, షరత్తులో ఎందుకు పెడతున్నారు.? ఇన్ని రకాల అంక్షలతో మేము బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలా..? మా డబ్బులు పొందేందుకు ఇన్ని ఇబ్బందులు పెడతారా.? అంటూ గ్రామీణ ప్రజానికం ఏకంగా కన్నెర్ర చేసింది.

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడులో మహిళలు ఏకంగా తిరగబడ్డారు. స్థానిక కార్పొరేషన్‌ బ్యాంకుపై రాళ్లతో దాడి చేశారు. ‘క్యాష్‌ తక్కువగా ఉంది. ముందు వృద్ధులకు పింఛను డబ్బులు ఇస్తాం’ అని బ్యాంకు మేనేజర్‌ అనడంతో.. అప్పటికి కొన్ని గంటలపాటు పడిగాపులు పడిన మహిళలు ఆగ్రహంతో రగిలిపోయారు. రోడ్డుపై నుంచి రాళ్ల దాడికి దిగారు. దీంతో సిబ్బంది.. షట్టర్లు వేసుకొన్నారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప నగరం శివార్లలోని ఎర్రముక్కపల్లె స్టేట్‌బ్యాంకు వద్ద క్యూలో తొక్కిసలాట చోటుచేసుకొని.. అద్దాలు పగిలాయి.

రైల్వేకోడూరులో వృద్ధాప్య పింఛను కోసం క్యూలో నిలబడిన సుబ్బమ్మ (60) స్పృహ తప్పి పడిపోయింది. ఈ పరిస్థితి ఒక్క కడప జిల్లాలోనే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పండుటాకులకు పడిగాపులు తప్పడం లేదు. మండే ఎండలో రోజంతా నిలువుకాళ్లపై వృద్ధులు నిలబడాల్సి వస్తున్నది. ఇక గుంటూరు జిల్లాలో.. రైతులు రోడ్డెక్కారు. గుంటూరు జిల్లా అమృతలూరులోని జాతీయ బ్యాంకుల వద్ద, రైతులు ఓపిగ్గా ఎదురుచూశారు. క్యూలు కట్టి నిలబడ్డారు. అధికారులను, సిబ్బందిని వేడుకొన్నారు. అయినా నగదు దొరకకపోవడంతో ఆగ్రహించి.. తెనాలి- చెరుకుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  demonetisation  rural parts  banks  ATM centers  

Other Articles