ట్రంఫ్ ఎన్నికల వేళ అలా.. అధ్యక్ష పగ్గాలను చేపట్టేప్పుడిలా.. Donald Trump Won't Push for Investigations of Hillary Clinton

Donald trump drops threat of new hillary clinton investigation

Presidential Election of 2016,Trump Donald J,Clinton Hillary Rodham, donald trump, barack obama, Hillary Clinton, rebels, republicans, electoral college, republicans, democrats

President-elect Donald Trump said he had no intention of pressing for an investigation into Hillary Clinton’s use of a private email server or the financial operations of her family’s foundation.

ట్రంఫ్ ఎన్నికల వేళ అలా.. అధ్యక్ష పగ్గాలను చేపట్టేప్పుడిలా..

Posted: 11/23/2016 04:36 PM IST
Donald trump drops threat of new hillary clinton investigation

తన గెలుపుతో అమెరికావాసులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్య ఎన్నికలను పరిశీలకులందరినీ విస్మయానికి గురిచేసిన అమెరికా ఎలెక్ట్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ప్రచారంలో ఒకలా వ్యవహరిస్తే.. పగ్గాలను అందుకోబోయే ముందు మరోలా పలు అంశాలపై స్పందించారు. మరీ ముఖ్యంగా అయన అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తన పోటీదారు అయిన హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపే ఉద్దేశం తనకు లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ క్యాంపెన్ మేనేజర్ కెల్యాన్నే కాన్వే స్వయంగా ఈ విషయాన్ని ఓ అమెరికన్ చానెల్ కు వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ-మెయిళ్ల కేసులో హిల్లరీని జైలుకు పంపాలంటూ డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కలిగించాయి. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత అమెరికాలో రేగిన విద్వంసాలు, అందోళనలకు బ్రేక్ పడిన తరువాత ఆయన గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. హిల్లరీ క్లింటన్ ఈ మెయిళ్ల విషయంలో యు టార్న్ తీసుకున్నారు. అమెను జైలుకు పంపే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశారు. హిల్లరీ క్లింటన్పై క్రిమినల్ చర్యలు తీసుకుంటే దేశంలో చాలా చీలికలు వస్తాయని తనకు అనిపిస్తుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు అమెరికా అధ్యక్షుడిగా వున్న బరాక్ ఒబామాపై కూడా ఘాటు వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా బరాక్ ఒబామా దిగిపోతారని ఘాటువ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తాజాగా తనకు ఒబామా అంటే చాలా ఇష్టం. ఆయన మంచి నాయకుడు. అంటూ గతంలో తన మాటల నుంచి పక్కకు జరిగారు. అధ్యక్ష పదవిని అందుకోబోయే ముందు అన్ని విధాల తాను సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ లేవనెత్తిన సమస్యలు ఇప్పుడు ఆయన అజెండాలో లేవని చెప్పారు.

ఇదిలా వుండగా, అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు అవసరం కాగా, ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ కు అధ్యక్షుడిగా పదవిని చేపట్టాడానికి ఆరుగురు రిపబ్లికన్లు విముఖత చూపుతున్నారు. ట్రంప్ ను వ్యతిరేకిస్తూ ఆరుగురు రెబల్స్ అపనమ్మక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు.  అంతేకాకుండా వీరు మరో 37మంది రిపబ్లికన్లను ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేయొద్దని కోరుతున్నారు. ఎలక్టోరల్ కాలేజ్ లో ఓట్లు తక్కువైనా, రిపబ్లికన్ల ఆధిక్యం గల హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ట్రంప్ కు అనుకూలంగా ఉండటంతో అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  barack obama  Hillary Clinton  rebels  republicans  electoral college  

Other Articles