2000 వేల నోటు కలర్ పోతే కంగారు పడకండి | 2000 currency note water test.

How to check 2000 currency note

2,000 Note Lose Colour, 2,000 Note Washed, New Note Water test, RBI on new note colour, Economic Affairs Secretary Shaktikanta Das, Note Pink Colour gone, Fake 2000 note

Good News: 2,000 Note Lose Colour When Washed or Rubbed.

2000 నోటు పై ఇంకో వార్త...

Posted: 11/16/2016 04:09 PM IST
How to check 2000 currency note

పాత నోట్ల వ్యవహారం ఏమోగానీ, ఇప్పుడొస్తున్న కొత్త 2 వేల నోటుతో జనాలకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఓవైపు సరిపడా చిల్లర దొరక్క ఆ రెండు వేల నోట్లు జేబుల్లో అలాగే ఉండిపోతుంటే, మరోవైపు అవి అసలువో.. నకిలీవో తెలీక వ్యాపారస్థులే కాదు, సామాన్య ప్రజలు కూడా అనుమానపడుతున్నారు. కారణం వాటి రంగు విషయంలో వస్తున్న సమస్యే.

ఈ నోటులను నీళ్లలో కడిగితే రంగు పోతుంది అంటూ ఓ మూడు వీడియోలు ఈ మధ్య యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో కాస్త ఆందోళన మొదలైంది. మొన్నటి దాకా చిప్ గిప్ అంటూ వార్తలు రాగా, ఖండించిన కేంద్రం ఇప్పుడు ఈ విషయంలో కూడా ఓ స్పష్టత ఇచ్చింది.

 

పెద్దనోట్ల రద్దు అనంతరం అందుబాటులోకి వచ్చిన కొత్త రూ.2 వేల నోటు ప్రత్యేకతలు, ముఖ్యమైన విషయాల గురించి ఇప్పటికే కూలంకుషంగా వివరించిన ఆర్థిక శాఖ మరో ప్రకటన చేసింది. పింక్ కలర్ లో ఉన్న కొత్త రెండు వేల రూపాయల నోటును తడిగుడ్డతో తుడిచినా లేకపోతే నీళ్లతో కడిగినా దాని కలర్ కొంచెం పోతుందట. అలా జరిగితేనే అది అసలు నోటని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాడు. ఒకవేళ రంగు ఏమాత్రం పోకుండా ఉంటే అది డూప్లికేట్ అన్నమాట. సో... రంగుపోతే భయపడాల్సిన అవసరం అస్సలు లేదన్న మాట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2  000 Note  pink colour gone  water test  

Other Articles