కేంద్రం నిర్ణయం.. ఆ వరుడి కుటుంబానికి శాపం.. bridegroom and family stands overnight at atm centers on wedding day

Bridegroom and family stands overnight at delhi atm centers on wedding day

demonetisation, rbi rules, atm waiver, atm withdrawal, bridegroom, Bhajanpura ATM, marriage, Delhi, pm modi demonetisation, demonetisation rules, rbi demonetisation, atm demonetisation, atm waiver, atm withdrawal, atm withdrawal charges, india news

currency demonetisation makes bridegroom suneel and his family members stands overnight at atm centers on wedding day

కేంద్రం నిర్ణయం.. ఆ వరుడి కుటుంబానికి శాపం..

Posted: 11/15/2016 11:59 AM IST
Bridegroom and family stands overnight at delhi atm centers on wedding day

దేశంలో అవినీతిని రూపుమాపేందుకు కేంద్రం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం అప్రకటిత కరెన్సీ ఎమర్జెన్సీని తలపిస్తుంది. ప్రధాని నిర్ణయంతో నల్లధన కుబేరులు ఒక్కరూ ఇప్పటి వరకు బయట పడకపోయినా.. సామాన్యులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లలో నిల్చుని ప్రాణాలు పొగొట్టుకున్న వారు లేకపోలేదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో పకడ్బంధీగా వ్యవహరించి.. తాము నిర్ణయం తీసుకుంటున్నామన్న కేంద్రం.. కేవలం నోట్ల రద్దు విషయంలోనే పకడ్భందీగా వ్యవహరించింది కానీ.. ప్రజల అవస్థలు, అవసరాలను పరిగణలోకి తీసుకోలేదని విమర్శలు పెల్లుబిక్కుతున్నాయి.

చేతిలో డబ్బులున్నా నిత్యావసర సరుకులు కొనేందుకు వీలులేని పరిస్థితి కొందరిదైతే.. అసలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు వీలు దొరకడం లేదని పలువరు కేంద్రంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తన అకౌంట్లో వున్న డబ్బును డ్రా చేసుకునేందుకు ఓ మహిళ టాప్ లెస్ గా మారిన ఘటనను మరువక ముందు.. ఆ వరుడి పాలిట కూడా కేంద్ర నిర్ణయం శాపంగా మారింది. మరికోన్ని గంట్లల్లో వధువు మెడలో మాంగల్యధారణ చేయాల్సిన వరుడు.. డబ్బుకోసం క్యూ లైన్లో నిల్చున దర్భర పరిస్థితి. ఆయనతో పాటు వారి కుటుంబసభ్యులందరూ ఈ క్యూ లైన్లోనే వున్నారు.

సాధారణంగా పెళ్లింటి పసుపుపారాణి పెట్టగానే అటు వదువును గానీ, ఇటు వరుడ్ని కానీ మూడు రోజుల ముందు నుంచి ఇంట్లోంచి బయటకు రానీయరు. కానీ కేంద్ర నిర్ణయం ఆ వరుడితో పాటు ఆ కుటుంబ సభ్యులను ఏటీయం కేంద్రాల వద్ద క్యూ లైన్లో నిల్చోబెట్టింది. కనీసం పెళ్లి ఖర్చులకు కూడా సరిపడా డబ్బు చేతిలో లేకపోవడంతో వరుడు సునీల్ తో పాటు అతని సోదరులు సోమవారం అర్ధారత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఏటీఎం సెంటర్ వద్దే గడపాల్సి వచ్చింది.

మరుసటి రోజు(మంగళవారం) పెళ్లి ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదని వరుడు సునీలో మీడియాతో తన అవేదన వెళ్లబోసుకున్నాడు. ఢిల్లీలోని భంజాన్ పుర ప్రాంతంలోని రెండు ఏటీఎం కేంద్రాల వద్ద పెళ్లి సమయంలో తమ కుటుంబం మనీ కోసం కష్టాలు పడ్డ తగిన ఫలితం రాలేదని వాపోయాడు. కొత్తనోట్లు మరింతగా వాడుకలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయని సునీల్ అభిప్రాయపడ్డాడు. ఇక రాత్రి నిద్ర కరువై జీవితంలో ఒక్కసారి జరిగే వివాహానికి నీరసించి వెళ్లాల్సి వస్తుందని భాధపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  rbi rules  atm waiver  atm withdrawal  bridegroom  Bhajanpura ATM  marriage  Delhi  

Other Articles