‘‘పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్ద కుంభకోణం’’ Demonetisation a big scam, surgical strike on poor alleges Kejriwal

Kejriwal attacks pm says bjp alerted its friends on currency ban

Arvind Kejriwal,Arvind Kejriwal demonisation,Rs 500,500 rupees note,1000 Rs Note,Rs 2000 new note, BJP alerted its friends on notes, Demonitization,BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Delhi Chief Minister Arvind Kejriwal is addressing the media amid the demonetisation move and crisis at ATMs across country.

‘‘పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్ద కుంభకోణం’’

Posted: 11/12/2016 11:16 AM IST
Kejriwal attacks pm says bjp alerted its friends on currency ban

పెద్ద నోట్లను రద్దు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వం భారీ స్కాంకు తెరలేపిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో కేంద్రమంత్రులు ఉలిక్కిపడ్డారు. ఆయన కేవలం ప్రచారం కోసమే ఇలా అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలు ఆయన అరోపణలను విని నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం అధికారం కోసమే లేనిపోనివన్నీ కల్పిస్తోందని, ఒకవైపు వాళ్లు అవినీతిపై పోరాడుతున్నామంటూ.. మరోవైపు అవినీతిపై పోరాడే చర్యలను విమర్శిస్తున్నారని పార్టీ నేతలు అన్నారు.

కేజ్రీవాల్ చేసిన ఆరోపణలలో ఒక్కదాన్నైనా ఆయన నిరూపించగలరా అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రశ్నించారు. దేశంలోని అవినీతిని, నల్లడబ్బుతో పాటు అటు వేళ్లూనుకుంటున్న ఉగ్రవాదాన్ని రూపుపామేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని, అందులో భాగంగానే పెద్ద నోట్లను రద్దు చేసిందని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ తమకు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, యావత్ దేశ ప్రజలు ప్రధాని చర్యలను శ్లాఘిస్తున్నా.. ఆయన మాత్రం విమర్శిస్తున్నారని సంతోష్ కుమార్ గంగ్వార్ దుయ్యబట్టారు. ఇంతకీ అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారో తెలుసా..?

అవినీతి నిర్మూలణ పేరుతో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అత్యంత పెద్ద కుంభకోణానికి తెరలేపిందని దుయ్యబట్టారు. ప్రధాని తన సన్నిహితులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఆ తర్వాత నోట్లను రద్దుచేశారని, అవినీతిపై పోరాటం పేరుతో భారీ స్కాంకు కొన్నిరోజుల క్రితం తెరతీశారని ఆయన అన్నారు. ప్రధాని సన్నిహితులంతా ముందుగానే తమ వద్ద ఉన్న నల్లధనాన్ని డిపాజిట్ చేసేసుకున్నాక అప్పుడు నోట్ల రద్దు ప్రకటన వచ్చిందని తీవ్రంగా ఆరోపించారు.
 
ఇప్పుడు జరిగేది కూడా అవినీతి అంతం కాదని.. పెద్ద మొత్తంలో డబ్బు కేవలం చేతులు మారుతుందని ఆయన అన్నారు. డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లు పన్నుతో పాటు 200 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, అంటే, వాళ్ల వద్ద ఉన్న డబ్బులో 90 శాతం కోల్పోవాల్సి వస్తుందని, అలాంటి సమయంలో నల్లడబ్బు దాచుకున్నవాళ్లు ఎందుకు అలా చేస్తారని ప్రశ్నించారు. అందువల్ల ప్రభుత్వమే పరోక్షంగా డబ్బులు డిపాజిట్ చేయొద్దని చెబుతోందని ఆరోపించారు.
 
పెద్ద నోట్ల రద్దుతో ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నది సామన్య ప్రజలని.. నల్లకుభేరులు కూర్చున్న స్థానం నుంచి కదలకుండా తమ డబ్బును యధ్దేశ్చగా చేతులు మార్చుకుంటున్నారని అయన అరోపించారు. ''దేశంలో నల్లడబ్బు దాచుకునేవాళ్లు ఎవరు.. అదానీలు, అంబానీలు, సుభాష్ చంద్రలు, బాదల్‌లు మాత్రమే. అంతేతప్ప రిక్షావాలాలు, చెప్పులు కుట్టుకునేవాళ్లు, కూలీలు, రైతులు ఎక్కడైనా నల్లడబ్బు దాస్తారా'' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Demonitization  BJP  ATM queues  Bank queue  New Currency Notes  

Other Articles