ఇదిగిదిగో రెండు వేల నోటు వచ్చేసిందోచ్ | RBI New 2000 Rupees Currency Note images released

Rbi new 2000 rupees currency note images released

RBI new two thousand rupees note, 2000 rupees RBI Note, RBI 2000 note, RBI new note, 2000 rupees note fake, Twitter trending with 2000 rupees note, Reserve bank of India 2000 rupees note

Images Of The Alleged New 2000 Rupee Notes viral in Twitter.

కొంపదీసి అవి దొంగనోట్లు కావు కదా?

Posted: 11/07/2016 10:40 AM IST
Rbi new 2000 rupees currency note images released

సోషల్ మీడియా ట్విట్టర్ లో గత రెండు రోజులుగా రెండు వేల రూపాయల నోటు చక్కర్లు కొడుతోంది. రిజర్వ్ బ్యాంక్ త్వరలో రిలీజ్ చేయబోతున్న నోటు ఇదేనంటూ వాటిని తెగ వైరల్ చేసేస్తున్నారు. కర్ణాటకలో ముద్రించబడినవిగా చెబుతన్న ఈ నోట్లు ఫిబ్రవరి 2017 నుంచి చెలామణిలోకి రానున్నాయంట.

కొన్నివారాల క్రితం ఆర్బీఐ రెండువేల రూపాయల నోటు రిలీజ్ చేయబోతుందన్న ప్రకటన జారీ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విడుదల చేసింది నిజమైందేనా అన్న విషయంపై అటు ప్రభుత్వ వర్గాలుగానీ, ఇటు బ్యాంకులు గానీ ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. పరిమాణంలో కాస్త పెద్దదిగా ఉన్న ఈ నోట్లు పింక్ కలర్ పేపర్ పై ముద్రించబడి ఉంది. చూడటానికి పాత సినిమాల్లో నోట్లలాగా కనిపిస్తున్నాయి.

ఇక ఓవైపు నల్లధనం నేపథ్యంలో చిన్న నోట్లను మాత్రమే చెలామణి చేయించాలంటూ ఆర్థికవేత్తలు సూచిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం షాక్ కి గురి చేసేదే . కానీ, దేశంలో ఇన్ ఫ్లేషన్ పెరుగుతున్న తరుణంలో , దరలను గమనంలోకి తీసుకుని రెండువేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టాలని బ్యాంక్ భావిస్తోందని మరొకొందరు. ఒకవేళ ఈ నోటు గనుక అమలులోకి వచ్చినట్లయితే దాచుకోడానికి నల్లకుబేరులకు, మరోపక్క ఎలక్షన్ల టైంలో పంచేందుకు నేతలకు చాలా ఈజీగా ఉంటుందేమో కదా! ఏది ఏమైనా దీనిపై అధికార ప్రకటన కోసం ఇప్పుడు అంతా వేచిచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2000 rupees note  RBI  Images  Twitter  

Other Articles