బాంబు పేల్చిన అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ Sasikala Pushpa fears someone will forge cm's signature to grab power

Mp sasikala pushpa fears someone will forge jayalalithaa s signature to grab power

Jayalalithaa,health,signature,forge,forgery,sasikala,sasikala pushpa,AIADMK,All India Anna Dravida Munnetra Kazhagam,Tamil Nadu,Chief Minister,general secretary,sign,C Vidyasagar Rao,Governor C Vidyasagar Rao,Letter,communication,Hospital,Apollo Hospital

Sasikala Pushpa, a former mp AIADMK, has written to Governor C Vidyasagar Rao expressing her apprehension that someone might commit fraud in order to seize power

బాంబు పేల్చిన అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ

Posted: 10/10/2016 05:29 PM IST
Mp sasikala pushpa fears someone will forge jayalalithaa s signature to grab power

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అస్పత్రిలో చికిత్స పోందుతున్న తరుణంలో అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప పెద్ద బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని కొంతమంది వ్యక్తులు ఫోర్జరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అమ అనుమానం వ్యక్తం చేశారు. ''ముఖ్యమంత్రి దగ్గరే ఉంటున్న కొంతమంది వ్యక్తులు'' అంటూ జయలలిత సన్నిహితురాలు శశికళను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు. ఈ మేరకు అమె రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు లేఖ రాశారు.

సుమారు గత 18 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసి, అన్నాడీఎంకే పార్టీకి ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీని నియమించాలని అనుకుంటున్నారని ఆమె తమిళనాడు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు కూడా వాళ్లు కుట్ర పన్నుతున్నారన్నారు. అందువల్ల జయలలిత నుంచి అధికారికంగా ఏదైనా లేఖ వస్తే మాత్రం అందులో ఆమె సంతకాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తనిఖీ చేయాలని గవర్నర్‌ను ఆమె కోరారు. ఈ విషయంలో గానీ, మరేదైనా విషయంలో గానీ జయలలిత నుంచి ఎలాంటి లేఖలు వచ్చినా సంతకాలు జాగ్రత్తగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

జయలలిత ఆస్పత్రిలో చేరిన తర్వాత నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఏ ఒక్కరినీ ఆమెను చూసేందుకు అనుమతించలేదు. కేవలం వైద్యులతో మాత్రమే మాట్లాడనిచ్చారు. చివరకు జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్, మేనకోడలు దీప కూడా జయలలిత వద్దకు వెళ్లలేకపోయారు. కానీ, జయ సన్నిహితురాలు శశికళ మాత్రం.. ఇన్నాళ్లుగా ఐసీయూలోనే ఆమె పక్కనే ఉంటున్నారు. దీనిపైనే రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles