కావేరి విషయంలో కర్ణాటక బలిపశువా..! Karnataka Victim, Not Villain In Cauvery Row: Siddaramaiah

Karnataka victim not villain in cauvery row siddaramaiah

Cauvery Water Dispute, Karnataka, Supreme Court, Tamil Nadu, siddaramaiah, chief minister, Cauvery Managment Board, Karnataka villain, Cauvery crisis, member, order, 6000 cusecs, national news, india news

Karnataka CM Siddaramaiah said the state was the "victim" and not the villain in the Cauvery water dispute as it was being portrayed by some people.

కావేరి విషయంలో కర్ణాటక బలిపశువా..!

Posted: 10/03/2016 12:56 PM IST
Karnataka victim not villain in cauvery row siddaramaiah

పాలనాపరంగా నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయన అసలు అభివృద్దికి సహకరించడంలేదని విదురాశ్వత్థంలో జరిగిన గ్రామసభలో నిప్పులు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీపై నిప్పులు చెరిగిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. తమను కేంద్రం విలన్ లా చిత్రీకరిస్తుందని అక్రోశాన్ని వెళ్లగక్కారు. తాము కష్టపడి నిర్మించుకున్న నాలుగు ప్రాజెక్టులకు పైసా కూడా ఇవ్వని కేంద్రం.. ఇప్పుడు తమ నీటి నిల్వల నుంచి తమిళనాడుకు నీటిని ఇవ్వమని అప్పనంగా అదేశాలు మాత్రం జారీ చేస్తుందని అయన అవేదన వ్యక్తం చేశారు. కేంద్రం విధానాల వల్ల తాము ప్రతినాయకులుగా చీత్రీకరించబడుతున్నామని కూడా అయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘మైసూరు నగర నిర్మాత దివంగత నల్వడి కృష్ణదత్త రాజ ఒడెయార్‌ బంగారు నగలను తాకట్టు పెట్టి కే.ఆర్‌.ఎస్‌ డ్యాంను నిర్మించారు. ఇక హారంగి, కబిని, హేమావతిలను కూడా మన సొంత డబ్బు ఖర్చుపెట్టి నిర్మించుకున్నాం. కానీ కేంద్రం మాత్రం అదేశాలను జారీ చేస్తూ తమ నీటి నిల్వలపై పెత్తనం చేస్తుందని మండిపడ్డారు. సాధారణంగా ‘కావేరి’ జలాశయాల్లో ఈశాన్య రుతుపనాలు బాగా పడితే 257 టీఎంసీల నీరు ఉండాలని, అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల 129 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందన్నారు.

ఇందులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ మొదటి వరకూ నీటిని వదిలామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ నాలుగు జలాశయాల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోవన్నారు. ఈ విషయాలన్నీ చెప్పినా కూడా కావేరి నీటిని తమిళనాడుకు వదలాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఎందుకు ఆదేశిస్తోందో అర్థం కావడం లేదని సిద్దరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరి విషయంలో కర్ణాటక బలిపశువన్నదే సత్యమని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cauvery Water Dispute  Karnataka  Supreme Court  Tamil Nadu  siddaramaiah  

Other Articles