కాలేజీలో కర్సెన్సీ నోట్లు.. అవాక్కయిన అదాయపన్ను అధికారులు.. IT department raids Vyadehi Institute of Medical Science, seizes Rs 42 crore cash

It officials shocked after raiding bengalore vaidehi medical collage

IT Raid, Income Tax department, Vyadehi Institute of Medical Science, Rs 42 crore cash seize, biggest IT seizure, Karnataka

In an IT raid that lasted around three days, at one of the prominent private medical colleges in Bangalore, Vydehi Institute of Medical Sciences and Research Centre, the authorities are reported to have seized around Rs 42 crores cash.

కాలేజీలో కరెన్సీ నోట్లు.. అవాక్కయిన అదాయపన్ను అధికారులు..

Posted: 09/29/2016 10:34 AM IST
It officials shocked after raiding bengalore vaidehi medical collage

కాలేజీలో కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. కరెన్సీ నోట్లంటే ఎదో ఒకటో రెండు కాదు కట్టలు కట్టలు కోద్ది డబ్బుల కట్టలు బయటపడటంతో అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. విద్య వ్యాపారంగా మారిపోయిందని అనేక విమర్శలు వస్తున్న తరుణంలో మరీ ముఖ్యంగా మెడికల్ విద్య అంటే కాసుల వర్షం కురిపించే విద్యగా పేరొందింది. ఈ తరహా కథానాల నేపథ్యంలో ఓ మెడికల్ కాలేజీపై దాడులు చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఇవి కథనాలు మాత్రమే కాదు వాస్తవాలు అని అర్థమైంది. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని వైదేహీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌పై దాడి చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులకు కళ్లు చెదిరిపోయాయి.

ఒకటో రెండో కాదు కట్టల కొద్దీ బయటపడిన సొమ్ము దాుడల్లో బయటపడటంతో వారు ఖంగుతిన్నారు. రూ.500, రూ.1000 నోట్లు బయటపడుతున్న తీరు చూసి అవాక్కయ్యారు. ఆ మొత్తాన్ని తరలించేందుకు ఏకంగా ట్రక్కునే రప్పించాల్సి వచ్చింది. మొత్తంగా ఐటీ అధికారుల దాడిలో లెక్కల్లో చూపని, అక్రమ ఆదాయం రూ.43 కోట్లు బయటపడింది. దేశంలోనే ఇది రెండో అతిపెద్ద దాడిగా అధికారులు చెబుతున్నారు. గతంలో పాండిచ్చేరిలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలపై దాడి చేసిన ఐటీ అధికారులు అప్పట్లో రూ.82 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద దాడి కాగా, తాజా దాడి కర్ణాటకలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు.

కళాశాలపై దాడి చేసిన అధికారులు డబ్బుతో పాటు పలు పత్రాలను, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా క్యాపిటేషన్ ఫీజు రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మేనని అధికారులు భావిస్తున్నారు. వైదేహీ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు మరణానంతరం ఆయన కుమార్తె కల్పజ, వైదేహీ కళాశాలను నిర్వహిస్తున్నారు. సంస్థ అక్రమ ఆదాయంపై పక్కా సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఉన్న ఆదికేశవులు గ్రూప్ కంపెనీలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పలుపత్రాలతోపాటు భారీగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.265 కోట్లకు ఆదాయపు పన్నులు చెల్లించకుండా లావాదేవీలు నిర్వహించినట్టు అధికారులు అంచనాకొచ్చారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles