పరీక్షలు ముంచుకోస్తున్న వేళ.. ‘సెలవుల’ తీపి కబురు.. dassera, christmas and sankranti holidays shedule for students

Dassera christmas and sankranti holidays shedule for students

Telangana government, schools, holidays, dassera holidays, christmas holidays, sankranti holidays, exams shedule, summative assainment, final exams, DROs, summer holidays

At the time when students are preparing for their exams telangana government has a good news for students, declaring dassera, christmas and sankranti holidays shedule and exam time table.

పరీక్షలు ముంచుకోస్తున్న వేళ.. ‘సెలవుల’ తీపి కబురు..

Posted: 09/20/2016 09:38 AM IST
Dassera christmas and sankranti holidays shedule for students

విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు పూర్తికావస్తున్న తరుణంలో మరో నాలుగు నెలల్లో వార్షిక పరీక్షలు జరుగనున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబరును అందించింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ విద్యాసంవత్సరంలో పరీక్షలను ఎప్పుడు నిర్వహించనున్నారన్న సమాచారంతో పాటు సెలవుల కబరును కూడా అందించింది. ఇటు దసరా సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తన్న విద్యార్థులకు సెలవుల కబరును అందిస్తూనే తదనంతరం అదే నెల అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3లోగా ఎస్ఏ-1 (సమ్మెటివ్ అసెస్ మెంట్-1) పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ నెల 30 నుంచి అక్టోబర్ 12 వరకూ దసరా సెలవులు ఉంటాయని రాష్ట్ర విద్యామంత్రిత్వ శాఖ జిల్లా విద్యాశాఖ అధికారులకు (డీఈఓలకు) ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆపై డిసెంబర్ 24 నుంచి 28 వరకూ క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు, 2017లో జనవరి 11 నుంచి 15 వరకూ సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ వేసవి సెలవుల అనంతరం జూన్ 12న తదుపరి విద్యా సంవత్సరం మొదలవుతుందని పేర్కొంది. ఇక వచ్చే సంవత్సరం మార్చి 7 నుంచి 15 వరకూ ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 6 నుంచి 18 వరకూ నిర్వహించాలని, వార్షిక పరీక్షలను మార్చి తొలి వారంలోనే ప్రారంభిస్తామని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana government  schools  holidays  exams shedule  summative assainment  DRO  

Other Articles