పొంతపార్టీ నేతలనే టార్గెట్ చేసిన అధినేత..? ఎవరూ.? TRS party chief targets his own party leaders

Trs party chief targets his own party leaders

gangster nayeem, TRS leaders, TRS chief, KCR, telangana CM, SIT police, police officials, former police officers, Land grabbings, victims complaints, LB nagar, Rangareddy district, tollywood nayeem, nayem tollywood, nayeem bedroom, nayeemuddin, sit, special investigation team, IG nagireddy, currency bundles, land documents, mahaboobnagar, Telangana

TRS party chief and Telangana CM Kchandra shekar rao targets his own party leaders in regard with gangster nayeem issue

పొంతపార్టీ నేతలనే టార్గెట్ చేసిన అధినేత..? ఎవరూ.?

Posted: 09/13/2016 08:34 PM IST
Trs party chief targets his own party leaders

పోలీసులు, రాజకీయ నేతలు, పాలకులు కలసి పాలు పోసి మరీ బలిస్టంగా పోషించినట్లు అరోపణలు ఎదుర్కోన్న కరడుగట్టిన నేరస్థుడు గ్యాంగ్ స్టర్ నయీమ్ విషయంలో సొంత పార్టీ నేతలని కూడా చూడకుండా వారిని కూడా టార్గెట్ చేసిన అధినేత ఎవరో ఇప్పటికే మీకు అర్థమైంది కదూ. ఆయన మరెవరో కాదు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. గ్యాంగ్ స్టర్ నయామ్ తో సంబంధాలు వున్న సొంత పార్టీ నేతలను, ఆయనతో పనులు చేయించుకున్న నాయకులను కూడా వదలకుండా టార్గెట్ చేశారు.

ఈ మేరకు నయీం వ్యవహారంతో సంబంధమున్న నేతలపై చర్యలకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. నయీం కేసు విచారణ నివేదిక సీఎం కేసీఆర్ చేతికి చేరింది. ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, 21 మంది పోలీసులు నయీంతో అంటకాకాగారని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నయీం వ్యవహారాన్ని ఇన్‌ఫార్మర్, గ్యాంగ్ స్టర్ కోణాల్లో నివేదిక ప్రస్తావించినట్లు సమాచారం. ఇన్ఫార్మర్ వ్యవహారంలో సంబంధమున్నవారికి ఊరటనిచ్చి.. గ్యాంగ్‌స్టర్ నయీంను వాడుకున్న వారిపై వేటు వేయడానికి రంగం సిద్ధమైంది. మొదట రాజకీయ నాయకుల నుంచే చర్యలు మొదలుకానున్నాయి. ఈ మేరకు గణేష్ నిమజ్జనం తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు సమాచారం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayeem  gangster  TRS leaders  TRS chief  KCR  telangana CM  SIT police  crime  

Other Articles