why do you kept slient on tdp wrong propaganda in AP.?

Bjp orders state bjp leaders to condemn tdp allegations

Andhra Pradesh, BJP Vice President, Arun Singh, AP Chief Minister, Chandrababu, Special status, TDP, Amit shah, PM modi, Narendra Modi

despite tdp wrong propaganda in the Andhra pradesh state, bjp high command questions why do bjp state leaders keep silent on special status issue and funds from centre to AP

వారి విమర్శలను ధీటుగా తిప్పికొట్టండీ..

Posted: 09/04/2016 07:52 AM IST
Bjp orders state bjp leaders to condemn tdp allegations

బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికోట్టాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌సింగ్ పార్టీ శ్రేణులను అదేశించారు. ఏపీకిలో పార్టీకి పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ఆయన బీజేపి రాష్ట్ర నేతల్ని గట్టిగా ప్రశ్నించారు. కేంద్రంలో మిత్రపక్షంగా వుంటూ నిధులు పోందుతున్న టీడీపీ సర్కార్..  రాష్ట్రంలో మాత్రం తమను దోషిగా మారుస్తూ.. వ్యతిరేక ప్రచారానికి తెరలేపుతుందని.. అయినా తమ నేతలు దానిని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారని ఆయన నిలదీశారు.  మిత్రపక్షంగా కొనసాగుతున్న టీడీపీ సైతం గడువులు పెట్టి బెదిరింపుల సవాళ్లు చేసినా స్పందించరా? అని తూర్పారపట్టారు.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించేందుకు విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్ధనాథ్‌సింగ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు, ముఖ్యనేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అరుణ్‌సింగ్ ప్రసంగిస్తూ.. విజయవాడలో తనకు ఎక్కడ చూసినా సీఎం చంద్రబాబు పెద్దపెద్ద ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయని.. ప్రధానమంత్రి మోదీ ఫ్లెక్సీ ఒక్కటీ కనిపించట్లేదన్నారు. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ ఒక్కదాన్నే దోషిగా చూపేలా మిత్రపక్ష టీడీపీసహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నేతలందరూ కృషి చేయాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  BJP  Arun Singh  AP CM  Chandrababu  Special status  TDP  

Other Articles