Manish Sisodia catches hospital employee watching movie at work, orders action

Manish sisodia sacks hospital staff for watching movie at work

manish sisodia, sisodia, manish sisodia hospital, delhi govt, delhi govt hospital, Delhi Government Hospital, delhi deputy cm surprise visit, government employee, manish sisodia fires employee, delhi news, viral video

During a surprise inspection in a Delhi government hospital, delhi deputy cm manish sisodia caught a government employee watching a movie as a long queue of patients were left waiting.

ITEMVIDEOS: ఉద్యోగిని తొలగించిన ప్రభుత్వంపై ప్రశంసలు..

Posted: 08/18/2016 07:03 PM IST
Manish sisodia sacks hospital staff for watching movie at work

ఉద్యోగిని ఉన్నఫలంగా విధుల నుంచి తొలగించిన ప్రభుత్వంపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. అదేంటి ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన తరుణంలో ఏకంగా ఉద్యోగిని తొలగించిన ప్రభుత్వంపై ప్రశంసలు కురియడమేంటి అంటారా..? అక్కడే వుంది అసలు ట్విస్టు. తానోక ప్రభుత్వ ఉద్యోగినని.. అందులోనూ ప్రభుత్వ అసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయిన ఓ ఉద్యోగి తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అయితే అతన్ని రెడ్  హ్యాండెడ్‌గా పట్టుకున్నడిఫ్యూటీ ముఖ్యమంత్రి అతన్ని విధుల నుంచి తొలగించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో విదులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి బయట రోగులు అనేక ఇబ్బందులు పడుతూ క్యూ లైన్లో వేచివున్నా.. తనకు పనేంటి అనుకుని కంప్యూటర్‌లో హాయిగా సినిమా చూస్తూ గడిపిన ఓ ఉద్యోగికి దిమ్మదిరిగే షాక్‌ తగిలింది. అతనికే కాదు విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇతర ఉద్యోగులకు కూడా ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలుస్తుంది. కంప్యూటర్‌ తెరపై వస్తున్న సినిమాలో మునిగిపోయిన ప్రబుద్ధుడిని  ఏకంగా డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీలలో భాగంగా వచ్చి డిస్టర్బ్ చేసి.. ఇంటికెళ్లి తీరిగ్గా సినిమా చూసుకోమ్మని చెప్పారు.

అప్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలపై ఇప్పటికే అక్కడి ప్రజలు కితాబిస్తున్న తరుణంలో ఇవాళ తాజాగా జరిగిన చర్యపై ప్రజలు ప్రశంసలు కురిసిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వాసుప్రతిలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగి కంప్యూటర్లో సినిమా చూడటాన్ని గమనించాడు. నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లి భుజం తట్టాడు. అప్పుడు గానీ ఆయన సినిమాలోకంలోంచి ఈ లోకంలోకి రాలేదు.

ప్రభుత్వ ఉద్యోగిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సిసోడియా 'ఇక్కడ ఇన్‌చార్జి ఎవరు? సినిమాలు చూడటానికి ఇక్కడికి వచ్చావా? ఆఫీసులో కంప్యూటర్లు సినిమాలు చూసేందుకు పెట్టారనుకున్నావా? సినిమాలు చూడాలని ఉంటే ఇంటికెళ్లి చూస్కో' అంటూ ఘటుగా వార్నింగ్‌ ఇచ్చారు. వెంటనే ఆ ఉద్యోగిని కొలువులో నుంచి తీసేశారు.  కంప్యూటర్‌ లో సినిమా చూస్తున్న ఉద్యోగిని ప్రత్యక్షంగా పట్టుకున్న సంఘటన తాలుకు వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles