Chandrababu Naidu hits out at Centre over unfulfilled promises to Andhra Pradesh

Andhra pradesh cm unfurls tricolour in anantapur

Andhra Pradesh, Chief Minister, Chandrababu Naidu, anathapur, flag hositing, independence day, chandrababu attack centre, chandrababu speech, independence day 2016

AP CM Chandrababu Naidu launched yet another attack on the Narendra Modi government saying it "failed to honour the promises" made to the state and vowed to not rest until he drew the "last paisa" from the Centre

మోడీ సర్కార్ ఇచ్చిన హామీలు నేరవేర్చలేదు: చంద్రబాబు

Posted: 08/15/2016 12:09 PM IST
Andhra pradesh cm unfurls tricolour in anantapur

ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్‌ జీపులో నిల్చొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు సీఎం మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో ప్రదర్శించిన వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎందరో మహనీయులను స్మరించుకోవాల్సి ఉందన్నారు. అయితే ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికలకు మందు, ఆ తరువాత పలు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదని తూర్పారబట్టారు. ముఖ్యంగా రాష్ట్రానికి కల్పిస్తామన్న ప్రత్యేక హోదాను మోడీ సర్కార్ విస్మరించిందని అన్నారు. రాజధానికి నిర్మాణంతో పాటు రాష్ట్ర అభివృద్ది కోసం ప్రతీ ఒక్కరు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ భరోసా పేరుతో పేదవారికి పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.  దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అగ్రవర్ణాల్లో పేదవారికి రిజర్వేషన్ల అమలును పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

రాయలసీమ అంటే ముఠా కక్షలు అనే అపవాదు ఉందని....రాయలసీమ రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జిల్లాలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలో సీఎం పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాయలకాలం నుంచి అనంతపురానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. అనంతపురం జిల్లా ప్రముఖుల పేర్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనంతపురం అంటే ఎన్టీఆర్‌కు ఎంతో అభిమానం ఉండేదని చంద్రబాబు గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Chief Minister  Chandrababu Naidu  anathapur  flag hositing  independence day  

Other Articles