భార్యకు బుద్ధి చెప్పాలని ఆ సైట్లో వివరాలు పెట్టాడు | Husband shares wife's details On escort site to 'teach Her A lesson', arrested.

Wife s details on escort site husband arrested

Pune husband, Pune woman, Wife details in escort site, Escort Site woman details, Husband shares wife's details

Husband shares wife's details On escort site to 'teach Her A lesson', arrested in pune.

ఆ సైట్లో భార్య పర్సనల్ వివరాలు... భర్త అరెస్ట్

Posted: 08/08/2016 05:33 PM IST
Wife s details on escort site husband arrested

పుణేలో ఓ భర్త భార్య పట్ల వ్యవహారించిన తీరుతో కటకటాల పాలయ్యాడు. తన భార్య వివరాలను ఫోన్ నంబర్ తో సహా ఓ సైట్లో పెట్టి మానసిక వేధింపులకు దిగాడు. చివరికి పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నాడు.

ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ కు చెందిన అరుణ్ వేకర్(35) అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ కు మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లాయ్యక పుణేలోని సన్ రోడ్డుకు నివాసం మార్చాడు. అయితే ఇద్దరికి ఈ మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయి. దీంతో భార్యపై కోపం పెంచుకున్న అరుణ్ ఆమె ఫోన్ నంబర్ తో పాటు అడ్రస్ తదితర వివరాలను ఓ ఎస్కార్ట్ సైట్లో పెట్టాడు. అంతే అప్పటి నుంచి ఆమెకు అభ్యంతరకర ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. విసిగి వేసారిన ఈ గృహిణి హింజేవాది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) అడ్రస్ సాయంతో అది ఫిర్యాదు చేసిన మహిళ ఇళ్లే అని గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆమె భర్త అరుణ్ ను విచారించగా అసలు విషయాలు వెలుగు చూశాయి. నిత్యం గొడవ పడుతూ తనను టార్చర్ చేస్తున్న భార్యకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఈ నీచానికి పాల్పడ్డానని ఒప్పేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pune  husband  wife  escort site  details  

Other Articles