Protests after Odisha NIFT student gangraped in KIIT University campus

Student gangraped inside nift campus

rape, gangrape, NIFT, KIT, kit campus, student, Akshaya Kumar Sahoo, Bhubaneswar, nift student gangrape, student gangrape, bhubaneshwar student gangrape, KIIT-Sikharchandi road, Bhubaneswar DCP Satyabrata Bhoi, molest, teenage girl sexual assault, molestation, sexual harrasment, sexual assult, crime

Tension prevailed in Odisha’s KIIT University campus following alleged gangrape of a student of National Institute of Fashion Technology (NIFT) by some unidentified youths.

ఒడిశాలోనిఫ్టు విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. విద్యార్థుల అందోళన

Posted: 08/07/2016 09:07 AM IST
Student gangraped inside nift campus

ఒడిశాలోని కటక్ జిల్లాలో మైనర్ బాలికపై ప్రైవేటు బస్సు డ్రైవరు, కండక్టర్లు జరిపిన హత్యాచార ఘటనను ఇంకా ఆ రాష్ట్ర ప్రజలు మరువక ముందే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని భువనేశ్వర్ లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక రైల్వే స్టేషన్ నుంచి నిఫ్ట్‌లోని హాస్టల్‌కు వస్తున్న విద్యార్థినిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కిట్ క్యాంపస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణ ఘటన విషయం తెలిసిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థిని తనను రక్షించమని కేకలు వేస్తున్నా అక్కడే ఉన్న సెక్యూటిరీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థులు ఆరోపించారు. అంతేకాక ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు హస్తం కూడా ఉందని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనతో రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీలకు పనిచెప్పి విద్యార్థులను చెదరగొట్టారు. రేప్ వార్తలను పోలీసులు ఖండించారు. అటువంటిది జరిగినట్టు తమకు సమాచారమేదీ లేదన్నారు.

బాధిత విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కిట్ యాజమాన్యం కూడా రేప్ ఆరోపణలను ఖండించింది. తమ క్యాంపస్‌లో అటువంటి ఘటనేమీ జరగలేదని, నిఫ్ట్‌లో అది జరిగి ఉంటుందని కిట్ స్టూడెంట్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సుచేత పేర్కొన్నారు. అయితే విద్యార్థుల వాదన మాత్రం మరోలా ఉంది. ఏం జరిగిందో చెప్పకుండా విద్యార్థిని భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  NIFT  KIT  kit campus  student  Akshaya Kumar Sahoo  Bhubaneswar  odisha  crime  

Other Articles