woman unable to see her husband panic commits suicide

Woman commits suicide after hiting hard on husbands head

wife kills husband, wife commits suicide, miyapur murder, sai lakshmi murder attempt, murali krishna, ganesh, omkar, miyapur police, wife kills husband, murder case. my home jewel murder, crime

woman unable to see her husband in unmovable situation since 4 years, commits suicide after hitting him hard on his head

భర్త అనుభవిస్తున్న బాధను తాళలేక భార్య...

Posted: 08/03/2016 08:07 AM IST
Woman commits suicide after hiting hard on husbands head

తన భర్త గత నాలుగేళ్లుగా పడుతున్న భాధను ఆయన సహదర్మచారిని సహించలేకపోయింది. జీవచ్ఛవంలా పడి ఉన్న భర్తకు, ఆయన పడుతున్న బాధల నుంచి విముక్తి కల్పించాలనుకుంది. నాలుగేళ్ల క్రితం వరకు ఎంతో శ్రమించి.. తన పనులు తానే చక్కబెట్టుకున్న భర్త.. ఒక్కసారిగా నిసహ్సాయ స్థితికి చేరడం. అవస్థలతో ఆయన నిత్యం నరకం అనుభవించడం అమె తాళలేకపోయింది. ఎటూ కదలలేని స్థితిలో ఉన్న భర్త తలపై రోకలి బండతో మోదింది.. ఆయన చనిపోయాడనుకుని 13వ అంతస్తు నుంచి కిందికి దూకి అమె కూడా ఆత్మహత్య చేసుకుంది.. ఐదు పదులు దాటిన దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న మైహోం జ్యువెల్స్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన మురళీకృష్ణ (65) ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయనకు భార్య వెంకట సాయిలక్ష్మి (56), కుమారులు గణేశ్, ఓంకార్ ఉన్నారు. వారికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరూ మంచి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. మురళీకృష్ణ నాలుగేళ్లుగా పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయని స్థితి. లేవడం, కూర్చోవడం, నడవడం కూడా చేయలేరు. భార్య వెంకట సాయిలక్ష్మి అన్నీ తానై భర్తకు సపర్యలు చేస్తోంది. భర్త అలాంటి పరిస్థితిలో ఉండడం భరించలేక పోయింది. తీవ్ర మానసిక వేదనకు గురై.. రెండేళ్లుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తామిద్దరం కలసి చనిపోతామంటూ కుమారులు, బంధువులతో చె బుతూ ఉండే ది.

గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా.. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుందంటూ కుమారులు నచ్చజెప్పారు. అప్పటి నుంచి కొంతకాలం బాగానే ఉన్న సాయిలక్ష్మి.. ఎంతకూ భర్తకు నయం కాకపోవడంతో ఆయనను చంపి, తనూ చావాలని నిర్ణయించుకుంది. కుర్చీలో కూర్చొని ఉన్న భర్త తలపై రోకలిబండతో గట్టిగా మోదింది. దీంతో మురళీకృష్ణ తలపై పెద్దగాయమై అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. రక్తంతో గది అంతా నిండిపోయింది. ఆయన మరణించాడనుకున్న సాయిలక్ష్మి... తాము ఉండే 13వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. అక్కడిక్కడే మృతి చెందింది. అపార్ట్‌మెంట్ వాసులు, స్థానికులు అది గమనించి కుమారులకు సమాచారమిచ్చారు. తీవ్ర గాయాలైన మురళీకృష్ణను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : miyapur police  wife kills husband  murder case. my home jewel murder  crime  

Other Articles