CIC summons Rajnath, Sonia, Mayawati, Karat and Pawar

Cic notice to rajnath mayawati karat pawar sonia

National parties, CIC notice, Rajnath Singh, Sonia Gandhi, mayavathi, central information commission, RTI queries, Prakash Karat, Sharad Pawar, Sudhakar Reddy

The central information commission has asked leaders of six national parties -- Rajnath Singh, Mayawati, Sonia Gandhi, Prakash Karat, Sharad Pawar and Sudhakar Reddy -- to appear before it for not responding to RTI queries.

జాతీయ పార్టీల అగ్రనేతలకు తాఖీదులు..

Posted: 07/17/2016 02:01 PM IST
Cic notice to rajnath mayawati karat pawar sonia

ఆరు జాతీయ పార్టీలకు చెందిన ప్రముఖులకు కేంద్ర సమాచార కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీజేపీకి చెందిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు కారత్‌, సుధాకర్ రెడ్డిలను తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. జాతీయ పార్టీలు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ గతంలో స్పష్టం చేసింది. దీంతో 2013లో ఆర్టీఐ కార్యకర్త ఆర్‌కె జైన్ ఆరు జాతీయ పార్టీలకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.

పార్టీ విరాళాలు, నిధులు, అంతర్గత ఎన్నికల వివరాలు కావాలని ఆయన కోరారు. ఆయా పార్టీలు స్పందించకపోవడంతో 2014 ఫ్రిబవరిలో కేంద్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఐసీ గాంధీ పేరుతో ఒకటి, పార్టీల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల పేరుతో నోటీసులు పంపింది. దీన్ని ఖండించిన జైన్ పార్టీల పట్ల ద్వంద వైఖరి అవలంభిస్తున్నారంటూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కేంద్ర సమాచార కమిషన్ జులై 20లోగా దీనిపై వివరణ ఇవ్వాలని, జులై 22న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. లేనిపక్షంలో చట్టం ప్రకారం వ్యవహరిస్తామని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : National parties  CIC notice  Rajnath Singh  Sonia Gandhi  mayavathi  

Other Articles