Two Indian men arrested in China for trying to molest Taiwanese woman

Two indian youth arrested in china for molesting

indian youth, china, arrest, molestation, taiwanese women, cctv footage, molestation, harassment, crime, indian men, molestation on woman, violence on women, rape attempt on women

The two men, hailing from Haryana were part of a group of traders brought to China by a tea company were arrested for trying to molest Taivanese woman in hotel lift.

చైనాలో ఇద్దరు భారతీయ యువకుల అరెస్ట్

Posted: 07/10/2016 12:02 PM IST
Two indian youth arrested in china for molesting

చైనాలో ఇద్దరు భారతీయులు అరెస్టు అయ్యారు. చైనా పోలీసులు ఇద్దరు భారతీయ యువకులను అరెస్టు చేశారు. ఓ టీ పౌడర్ సంస్థ తరుపున చైనా పర్యటనకు వెళ్లిన భారతీయ యువకులు పరాయి దేశంలో కూడా చేయకూడని పనిచేస్తూ పట్టబడి కటకటాలు లెక్కపెడుతున్నారు. తాము తాత్కాలిక నివాసం వుంటున్న ఓ హోటల్ లో..  తైవాన్ కు చెందిన ఓ మహిళను వేధిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. సరదాగా ఓ హోటల్ కు వెళ్లిన వారు ఈ పనిచేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.  

ఓ టీ పౌడర్ సంస్థ ఉత్తమ సేల్స్ చేసిన భారతీయ రిటైల్ దుకాణాదారులను చైనా పర్యటనకు తీసుకెళ్లింది. అక్కడ వారు నివసిస్తున్న హోటల్ గదిలోనే తైవాన్ కు చెందిన ఓ పర్యాటకురాలు కూడా రూమ్ తీసుకుంది. అయితే హోటల్ లిఫ్ట్ లో అమె కిందకు దిగుతున్న సమయంలో ఇద్దరు భారతీయ యువకులు అమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరిద్దరు కూడా హర్యానా ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు 28ఏళ్ల వయస్సు గలవారు ఒకరైతే.. మరోకరు 50 ఏళ్లు వున్నావారు మరోకరని పోలీసులు తెలిపారు.

అయితే వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించకపోవడంతో  సీసీటీవీ ఫూటేజ్ లను పరిశీలించిన పోలీసులు వాటిని సాక్ష్యాలుగా సేకరించిన పిమ్మట భారతీయులను అరెస్టు చేశారు. లిఫ్టు నుండి బయటకు వెళ్తున్న అమెతో బలవంతంగా ఫోటోలు దిగడంతో పాటు బయటకు వెళ్లకుండా లోనికి లాగడం వంటి చర్యలు రికార్డయ్యాయి. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian youth  china  arrest  molestation  taiwanese women  cctv footage  

Other Articles