driver attempts to rape passenger in vijayawada nuziveedu

Woman throws chilli powder into driver eyes to escape rape attempt

rape attempt, Sitarampuram Tanda, d baburao, taxi driver, chilli powder, rapist, woman, vijayawada rape attempt, nuziveedu, crime

A woman observing the road to her village was alerted as taxi drver takes her in wrong way, and throws chilli powder into his eyes to escape rape attempt.

కళ్లల్లో కారం కొట్టి.. మృగాడి కావరం అణిచింది..!

Posted: 07/06/2016 04:03 PM IST
Woman throws chilli powder into driver eyes to escape rape attempt

దేశంలో మహిళలపై నానాటికీ అకృత్యాలు పెరిగిపోతున్నాయి. అబలలను అమాంతం కబళించి వేస్తున్న పైశాచిక మృగాల ఘటనలు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం తాము అబలలం కాదు సబలలం అని నిరూపించుకుంటున్న మహిళల సంఖ్య కూడా నమోదవుతుంది. కాగా, అత్యంత తక్కువగానే ఈ విధమైన సబలలు మగమృగాళ్లపై తిరగడుతున్నారు. కరాటే సహా ఇత్యాది మార్షల్ అర్ట్స్ వచ్చిన వారే మృగాళ్లకు గుణపాఠం చెబుతున్నారు.

కాగా, తనకు ఏలాంటి మార్షల్ అర్ట్ రాకపోయినా.. తాను కూడా సబలననే రుజువు చేసుకుని.. మగ మృగంపైకి ధైర్యంగా తిరగబడింది. తన మానప్రాణాలను కాపాడుకుంది. తనపై ఒళ్లూపై తెలియకుండా లైంగిక దాడికి యత్నించే పైశాచిక మృగానికి తగిన రీతిలో బుద్ధి చెప్పింది కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ఓ మహిళ. తనను కబళించేందుకు యత్నించిన ఓ మృగాడి కళ్లల్లో కారం చల్లి చితకబాదింది. సదరు ధీర వనిత దాడితో బెంబేలెత్తిన ఆ మృగాడు కాళ్లకు బుద్ధి చెప్పక తప్పలేదు.

వివరాల్లోకి వెళ్తే.. నూజివీడు గ్రామానికి చెందిన వివాహిత (27) రాత్రి 10 గంటల సమయంలో నూజివీడు నుంచి రెడ్డిగూడెం వెళ్లేందుకు విస్సన్నపేట బస్సు కోసం వేచిచూస్తోంది. ఆ సమయంలో ఏపీ20వై 4848 కారులో వచ్చిన టాక్సీ డ్రైవర్ డి.బాబురావు తాను రెడ్డిగూడెం వెళ్తున్నానని ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. రెడ్డిగూడెం వెళ్తున్నట్లుగా తీసుకువచ్చిన బాబురావు సీతారామపురం స్టేజీ సమీపంలో కూనపరాజుపర్వ వెళ్లే రహదారివైపు కారు మళ్లించాడు. దీంతో అప్రమత్తమైన మహిళ మృగాడికి బుద్ది చెప్పాలనుకుంది.

కూనపరాజసర్వ వెళ్లే దారిలో కారును నిలిపేసి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి  లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆమె బ్యాగులో ఉన్న కారం పొట్లం తీసి బాబురావు కళ్లల్లో కొట్టి కారులో నుంచి దిగి కేకలు వేసింది. జరిగిన విషయాన్ని ఫోన్‌లో తల్లికి వివరించడంతో ఆమె రెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్.ఐ. అభిమన్యు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకునేసరికి బాబురావు కారు వదిలి పారిపోయాడు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారును సీజ్‌చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape attempt  Sitarampuram Tanda  d baburao  taxi driver  chilli powder  crime  

Other Articles