Ram kumar accused in murder case agrees of crime

Swathi murder case accused gets 15 day judicial custody

Swathi, murder case, Infosys employee, Ramkumar, Chennai, Tamil Nadu, Judicial Custody, police, crime

Ramkumar, the accused in the murder of Infosys techie S Swathi was sent to judicial custody for 15 days

స్వాతి హంతకుడికి పక్షం రోజుల రిమాండ్.. నేరం అంగీకరణ

Posted: 07/03/2016 12:26 PM IST
Swathi murder case accused gets 15 day judicial custody

ప్రేమించాల్సిందిగా ఎంతగానో బతిమలాడాను, చీదరించుకుంది, చీకొట్టింది, అందుకే చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని తానే హత్యచేశానని నిందితుడు రామ్‌కుమార్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కోన్నాడు. ఇవాళ ఆయనను న్యాయమూర్తిని ఎదుట ప్రవేశపెట్టగా పక్షం రోజుల పాటు రిమాండ్ విధించారు. పోలీసులు కోర్టులో సమర్పించిన నిందితుడు వాంగ్మలంలో నిందితుడు చెప్పిన అనేక విషయాలు వెల్లడించారు.

తాను స్వాతిని హత్య చేసేందుకు గల కారణాలను వివరిస్తూ.. తిరునెల్వేలిలోని ఐన్‌స్టీన్ ఇంజనీరింగ్ కళాశాలలో గత ఏడాది మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయాల్సి ఉండగా నాలుగు బ్యాక్‌లాగ్స్ నిలిచిపోయాయన్నాడు. దీంతో మూడు నెలల క్రితం ఉద్యోగాన్వేషణలో చెన్నైకి చేరుకున్నాను. చూలైమేడు సౌరాష్ట్రా నగర్‌లోని ఏఎస్ మేన్షన్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని సమీపంలోని ఒక వస్త్రదుకాణంలో గుమాస్తాగా చేరాను.

అక్కడి సమీపంలో నివసించే స్వాతి ప్రతిరోజూ నేను నివసించే మేన్షన్ మీదుగానే వెళ్లేది. నేను మెకానికల్ ఇంజనీరునని, నెలకు రూ.లక్ష జీతానికి పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాను. ప్రతిరోజూ మాటలు కలపడం ప్రారంభించాను. ఈ దశలో నేను ఇంజనీరును కాదని, ఒక వస్త్రదుకాణంలో గుమాస్తా అని స్వాతి తెలుసుకుని దూరం పెట్టడం ప్రారంభించింది. స్వాతిపై ప్రేమను పెంచుకున్న తాను అనేక సార్లు ఆమె వెంటపడి చెప్పడం ప్రారంభించాను. తనపై కోపంతో కసిరికొట్టింది. వెంటపడవద్దని బెదిరించింది. అంతేకాదు కొండముచ్చులా ఉన్నానని పదే పదే గేళి చేసింది. దీంతో నాలో ఉన్మాది నిద్ర లేవటం ప్రారంభించాడు. ప్రతిరోజూ తండ్రిని వెంటపెట్టుకుని రైల్వేస్టేషన్‌కు వెళుతూ నేను మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది.
 
స్వాతితో కలిసి ఉన్న జీవితాన్ని ఊహించుకున్నా, ఆమె లేని జీవితం వృథాఅని బాధపడ్డాను. ఇలా ఎడబాటుకు లోనైన స్థితి లో నాకు దక్కని స్వాతి ఎవ్వరీ దక్కకూడదని భావించాను. స్వాతిని చంపేయాలని నిర్ణయిం చుకుని పుస్తకాల మాటున కత్తిపెట్టుకుని రెండురోజులు వెంటపడ్డాను. మూడోరోజైన గత నెల 24వ తేదీన ప్రేమించాలంటూ ప్లాట్‌ఫారంపైనే చివరిసారిగా బతిమాలాడాను. అయితే యథాప్రకారం చీకొట్టడంతో ఆగ్రహంతో హతమార్చానని రామ్‌కుమార్ అంగీకరించాడు. పూర్తిస్థాయి విచారణ కోసం రామ్‌కుమార్‌ను రెండు రోజుల్లో చెన్నైకి తీసుకురానున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swathi  murder case  Infosys employee  Ramkumar  Chennai  Tamil Nadu  Judicial Custody  police  crime  

Other Articles