24 arrested in woman, lover tied together naked case

Man strips wife lover posts pictures online

Woman, lover, Rajasthan village, Rajasthan, Udaipur district, Kasotia village, 24 arrested, Woman-lover naked parade, husband, social media, Photos, woman tortured, tribal, tribal woman, woman paraded naked, lover, crime

Twenty-four people have been arrested for allegedly stripping and tying a 26-year-old woman and her paramour to a tree here.

ITEMVIDEOS: నడివీధిలో.. భార్యను నగ్నంగా కట్టేసి..

Posted: 06/28/2016 10:34 AM IST
Man strips wife lover posts pictures online

నాగరికత రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో రాజస్థాన్లో మాత్రం ఇంకా అటవిక న్యాయాలు రాజ్యమేలుతున్నాయి. తనవారు, పరాయి వారు అన్న తేడాలేకుండా, అడ, మగ అన్న వ్యత్యాసాన్ని కూడా మర్చిపోయి కుల పెద్దలు, గ్రామ పెద్దలు పంచాయితీల్లోనే దారుణ శిక్షలు కొనసాగుతున్నాయి. తాను పెళ్లిచేసుకున్న భార్యకు అంతకుముందే వేరే వ్యక్తితో ప్రేమాయణం వుందని తెలిసి వారిద్దరినీ పట్టుకుని నగ్నంగా గ్రామ నట్టనడి వీధిలో కట్టిపడేశారు. రాజస్థాన్ లో ఉదయ్పూర్ జిల్లాలో అనాటి ద్రౌపతి వస్త్రాపహరణలో దుశ్వాసన పర్వాన్ని గుర్తుచేసే విధంగా వున్న ఈ ఘలనలో పోలీసులు 24 మందిని అరెస్టు చేశారు.



తనకు ఇస్టం లేని పెళ్లి చేసిన తల్లిదండ్రులను నిందించకుండా.. తానను పెళ్లి చేసుకున్న భర్తను వదిలి ప్రియుడితో పారిపోయిన మహిళకు గ్రామం నడిబొడ్డున అవమానం జరిగింది. భార్యను అమెతో పాటు అమె ప్రేమికుడిని తమ గ్రామానికి తీసుకోచ్చిన భర్త, ఆయన కుటుంబ సభ‍్యులు, గామస్తులు కలసి.. గిరిజన తెగకు చెందిన ఆ యువతిని, ప్రియుడిని పట్టుకుని వచ్చి నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత ఇద్దరినీ అలాగే రెండు రోజుల పాటు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. వారి చిత్రహింసలకు బాధితులు అంగలార్చుతున్న వారిని కనుకరించలేదు.

సంఘటన గురించి తెలుసుకున్న యువతి ప్రియుడు లాలూరామ్ కుటుంబ సభ్యులు.. భర్త కుటుంబసభ్యులకు పరిహారంగా 80 వేల రూపాయలు చెల్లించడంతో రెండు రోజుల తర్వాత అతణ్ని విడిచి పెట్టారు. అయితే బాధితురాలిని మాత్రం అలానే నగ్నంగా కట్టిపడేశారు. కొందరు యువకులు ప్రేమికులు నగ్నంగా కట్టిపడేసిన ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయం, స్కూలుకు సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. స్కూలు టీచర్లు, వైద్య సిబ్బంది ఈ దృశ్యాలను చూసినా గ్రామపెద్దల వుండటంతో అధికారులకు ఫిర్యాదు చేసేందుకు అక్కడి వారు భయపడ్డారు.

కొందరు గ్రామ యువకులు ప్రేమికులు నగ్నంగా కట్టిపడేసి వున్న ఫోటోలను తీసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో.. చివరాఖరకు విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత మహిళను రక్షించారు. మహిళ భర్త, ముగ్గురు మహిళలతో సహా పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో తొలుత 13 మందిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత 11 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశారు. ఉదయ్పూర్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ గ్రామంలో పోలీసు క‍్యాంపు ఏర్పాటు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Udaipur district  Woman-lover naked parade  24 arrested  husband  crime  

Other Articles