వైసీపీ కులగజ్జి రేంజ్ లో ఉందన్న సొంతనేత | guruvachary alleges YSRCP priorty to caste politics only

Guruvachary alleges ysrcp priorty to caste politics only

BC cell convenor guruvachary, YSRCP priorty to caste politics only, జగన్ కి కులగజ్జి, వైసీపీ కుల రాజకీయాలు, వైసీపీకి కులగజ్జి, తాజావార్తలు, తెలుగు వార్తలు, ఏపీ రాజకీయాలు, latest news, telugu news

guruvachary alleges YSRCP priorty to caste politics only. join in TDP.

వైసీపీ కులగజ్జి రేంజ్ లో ఉందన్న సొంతనేత

Posted: 06/22/2016 12:43 PM IST
Guruvachary alleges ysrcp priorty to caste politics only

ఆపరేషన్ ఆకర్ష్ కి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కోక్కరుగా వీడుతున్న కనీసం వారిని నిలువరించే ప్రయత్నం చేయలేకపోతున్నాడు జగన్. ప్రతిపక్షంగా ప్రజావాణి వినిపించడంలో విఫలమవటంతోపాటు, పార్టీపై పట్టుకోల్పోతూ దెబ్బ మీద దెబ్బ తగిలించుకుంటున్నాడు. సమరశంఖారావాలంటూ ఏ మాత్రం ప్రభావం చూపని దీక్షలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. కాగా, అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ఆకర్ష్ కి ఎమ్మెల్యేలే కాదు, కీలక నేతలు కూడా లొంగిపోతున్నారు.

తాజాగా ఆ వైసీపీ అనుబంధ విభాగాల నేతలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరిపోయారు. బుధవారం ఒక్క గుంటూరులోనే దాదాపు 320 మంది వైసీపీలోకి చేరిపోయారు. పిడుగురాళ్లలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గురవాచారి తన అనుచరగణంతో టీడీపీలోకి చేరిపోయారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో పసుపు పచ్చ కండువా కప్పేసుకుని గురవాచారి సైకిలెక్కేశారు. ఈ సందర్భంగా గురవాచారి వైసీపీ సంస్కృతిపై సంచలన ఆరోపణలు చేశారు.

వైసీపీలో కుల పోరు తారస్థాయిలో ఉందని చెప్పిన ఆయన పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు అసలు సరైన స్థానం ఇవ్వలేదని ఆరోపించారు. కులాలకు సమాన ప్రాధాన్యం ఇస్తానంటూ మీటింగ్ లలో ఊదరగొట్టే జగన్ అసలు స్వరూపం వేరే ఉందని చెప్పాడు. కేవలం ప్రజా దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో సరిగా ఆంగ్లం రాని తనతో పార్టీ తరఫున హైకోర్టులో కేసులు వేయించారని ఆరోపించారు. నిన్నటి దాకా పార్టీలో కీలక నేతగా ఉన్న గురువాచారి చేసిన ఈ ఆరోపణలతో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుందని అర్థమౌతోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guruvachary  YSRCP  TDP  caste politics  

Other Articles