యువనేతల ‘నాన్నకు ప్రేమతో’... | KTR jagan and lokesh posted fathers day tweets

Ktr jagan and lokesh fathers day tweets

KTR fathers day tweet and photos, jagan fathers day tweet, naralokesh fathers day tweet, KTR jagan and lokesh fathers day tweets, నాన్నకు ప్రేమతో కేటీఆర్, లోకేష్, జగన్, ట్విట్టర్లో యువనేతల తండ్రుల కథ, నాన్నకు ప్రేమతో యువనేతలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, తెలుగు రాజకీయాలు, latest news, telugu politics, latest news, telugu news

KTR jagan and lokesh fathers day tweets in twitter. And posted photos of their father relation in social media.

యువనేతల ‘నాన్నకు ప్రేమతో’ ...

Posted: 06/20/2016 01:12 PM IST
Ktr jagan and lokesh fathers day tweets

‘ఫాదర్స్ డే’ సందర్భంగా నిన్నఆదివారం (జూన్ 19) ప్రపంచవ్యాప్తంగా తనయులు తండ్రుల సేవలో మునిగిపోయారు. సెలబ్రిటీలు సైతం తమ పితృ ప్రేమను సోషల్ మీడియాలో పంచేసుకున్నారు. ఇక తెలుగు నేలలో రాజకీయ వారసులుగా తెరంగేట్రం చేసిన ముగ్గురు కీలక నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కల్వకుంట్ల తారకరామారావు, నారా లోకేశ్ తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ప్రత్యేకంగా పోస్ట్ లు పెట్టారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువనేతలు తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

వీటిలో కేటీఆర్ ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. తాను తండ్రి అయ్యాక గాని తన తండ్రి తమకోసం చేసిన త్యాగాలు తెలిసిరాలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘మా నాన్న నా కోసం చేసిన త్యాగాలు నేను నాన్న అయ్యాక తెలిసివచ్చాయి’’ అంటూ ఆయన ట్వీటారు. ఇక ఈ ట్వీట్ కు ఆయన ఓ రెండు రేర్ ఫొటోలను కూడా యాడ్ చేశారు. టోపీ, కళ్లద్దాలు పెట్టుకున్న తన కొడుకు, కూతురుతో కలిసి టోపీ మాత్రమే పెట్టుకున్న తన తండ్రి ఫొటోను పోస్ట్ చేసిన కేటీఆర్... తనను తన తండ్రి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మరో ఫొటోను కూడా ఆయన దానికి జత చేశారు.

ప్రతీ యేడు లాగానే ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకున్నారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తన ట్విట్టర్ ఖాతాలో జగన్ ‘ఫాదర్స్ డే గ్రీటింగ్స్’ను పోస్ట్ చేశారు. ‘‘నా జీవితంలోని ప్రతి ప్రయాణంలో ఎల్లప్పుడూ మా నాన్నే నిజమైన గొంతుక. నాపై ఆయన ఉంచిన నమ్మకమే... ఆయన నాకు ఇచ్చిన గొప్ప బహుమతి’’అని జగన్ ట్వీట్ చేశారు.

ఇక చివరగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా తండ్రి నారా చంద్రబాబునాయుడికి గ్రీటింగ్స్ చెప్పారు. ‘‘అన్ని వేళలా, అన్ని చోట్లా అండగా నిలిచారు... థ్యాంక్యూ డాడ్’’ అంటూ తండ్రి చంద్రబాబుకు కృతజ్ఞతలతో కూడిన శుభాకాంక్షలు చెప్పారు. తన పట్ల తండ్రి వైఖరిని ఆసక్తికరంగా ప్రస్తావించిన లోకేశ్ ‘‘నాపై మా నాన్న చూపిన ప్రేమ విలువ నేను తండ్రిని అయ్యాక గుర్తించాను. ఆయన ఎంత పని ఒత్తిడిలో ఉన్నా అన్ని వేళలా, అన్ని చోట్లా నాకు అండగా నిలిచేవారు’’ అంటూ పేర్కొన్నారు. చివర్లో తనయుడు దేవాన్ష్ గురించి కూడా ఈ సందర్భంగా తన మనసులోని భావాలను లోకేశ్ వెలిబుచ్చారు. ‘నీ నవ్వే నా ప్రపంచాన్ని గొప్పగా మారుస్తోంది’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘నవ్వుతున్న దేవాన్ష్ ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ నవ్వుతోనే మేము ఫాదర్స్ డే సంబరాలు జరుపుకున్నాం’’ అని ఆయన ట్వీట్ చేశాడు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Jagan  Nara Lokesh  fathe's Day Tweets  

Other Articles