ambati rambabu slams Tdp government

Ambati takes on tdp government

mudragada padmanabham, ambati rambabu, chandrababu, TDP Government, pakistam terrorist, ajmal kasab, rajamundry, pakistan, boarder

ysrcp spokes person ambati rambau takes on chandrababu government, questions why they treating mudragada padmanabham as terrorist ajmal kasab

ముద్రగడ పద్మానాభంను కసబ్ కన్నా దారుణంగా..

Posted: 06/12/2016 01:44 PM IST
Ambati takes on tdp government

కాపు సంఘం హక్కుల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పాకిస్థాన్ టెరరిస్టు కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైఎస్సార్ సిపీ  అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయనను రామర్శించేందుకు వెళ్లిన తమను అరెస్టు చేసి పోలీసులు కోరుకొండ స్టేషన్ కు తరలించారని చెప్పారు. రాజమండ్రిలో వందలమంది పోలీసులు ఉన్నారని, పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. అక్కడ చూస్తుంటే రాజమండ్రిలో ఉన్నామా.. లేక పాకిస్థాన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని అంబటి చెప్పారు.

ముద్రగడ విషయంలో ఉగ్రవాది కసబ్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు దౌర్జన్య పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్ చేసే వాళ్లను కొడుతూ పోలీసులు బంద్ విఫలానికి ప్రయత్నించారని, సాధారణ పోలీసు అఫీసర్ నుంచి ఐపీఎస్ వరకు ఇలాగే వ్యవహరించారని, అసలు పోలీసుల విధులు ఇవేనా అని ప్రశ్నించారు. ముద్రగడను ఎవరు చూడాలనకుంటే వారు చూసేందుకు అనుమతించాలని, ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించాలని డిమాండ్ చేశారు.

ఏం జరుగుతుందో తెలియక ఆంధ్ర కాపు సోదరులంతా ఆందోళన చెందుతున్నారని, వెంటనే ముద్రగడతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయించి, వారి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అంబటి డిమాండ్ చేశారు. పద్మానాభం చెప్పినట్టు ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్ని హామీలైన గుప్పిస్తారని రాష్ట్ర ప్రజలకు అర్థయమైందన్నారు. అధికారంలోకి రాకముందు కాపులకు హామీలు గుప్పించిన టీడీపీ.. అధికారంలోకి రాగానే వారిని విస్మరించిందని, హామీలను నెరవేర్చాలని అగిడితే జైళ్లో పెట్టించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada padmanabham  ambati rambabu  chandrababu  TDP Government  

Other Articles