పిలక ఆ పిల్లాడికి శాపంగా మారింది | school rejected admission to boy for ponytail

School rejected admission to boy for ponytail

bangalore school, kindergarten student, ponytail, ponytail kid bangalore school, బెంగళూరు పిల్లాడు పిలక, పిలక పిల్లాడికి శాపం, పిల్లాడికి పిలక అడ్డంకి, పిలక ఉందని గెంటేశారు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, telugu news

A private school in the city has expelled a kindergarten student allegedly because he has a ponytail.

పిలక ఆ పిల్లాడికి శాపంగా మారింది

Posted: 06/11/2016 10:45 AM IST
School rejected admission to boy for ponytail

వ్యక్తిగత జీవితశైలి ఎలా ఉన్న సంప్రదాయాలు, ఆచారాలు పాటించడంలో భారతీయులు ఎప్పుడూ నిబద్ధతతో ఉంటారు. అయితే కొందరి వెర్రి వేషాల కారణంగా వాటికి అవాంతరాలు ఎదురవటం తరచూ జరిగేదే. అనాదిగా తూచా తప్పుకుండా ఆచారాన్ని పాటిస్తూ వస్తున్న ఓ కుటుంబానికి ఇక్కడ అదే పెద్ద సమస్యగా మారింది. పోనీటెయిల్ వారి మూడున్నరేళ్ల పిల్లాడికి పెద్ద శాపంగా మారింది.

బెంగళూర్ కు చెందిన బాబూసాబ్ పాల్యా తన కొడుకు విష్ణుని పాఠశాలలో చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. 43 వేల రూపాయలు చెల్లించి బనస్ వాడీ మెయిన్ రోడ్డులోని సెయింట్ విన్సెంట్ పల్లొట్టి స్కూల్లో చేర్పించాడు. ఆపై మొదటి రోజు పిల్లాడిని స్కూల్లో దిగబెట్టాలని వెళ్లిన మంజునాథ్ కు ప్రిన్స్ పాల్ పెద్ద షాకిచ్చింది. విష్ణుకు ఉన్న పోనీ టెయిల్ (పిలక) తొలగిస్తేనే పాఠశాలలోకి అనుమతిస్తామని చెప్పారు.

అయితే అది తమ కుటుంబ ఆచారమని, అలా చేయటం సాధ్యం కాదని మంజునాథ్ తెలిపాడు. అయినా ససేమిరా అన్న ప్రిన్స్ పాల్ పిలక తొలగించాల్సిందేనని తేల్చి చెప్పాడు. కాళ్ల వేళ్ల పడ్డా కనికరించకపోగా, చివరకు వారు చెల్లించిన 43 వేలు తిరిగి ఇచ్చేసి అడ్మిషన్ కాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. పిల్లాడు సైతం బతిమిలాడగ అటెండర్లతో ఇద్దరినీ మెడపట్టి గెంటించేశాడు. ఒక్క  ఈ స్కూలే కాదు, బెంగళూర్ లో చాలా ప్రైవేట్ స్కూళ్లకు ఇలాంటి పైత్యం ఉందని తెలుస్తోంది. ఎవరూ  అడ్మిషన్ ఇచ్చేందుకు ముందుకు రాకపోవటంతో ఏం చేయాలో పాలుపోక ఆ పిల్లాడి తండ్రి తల పట్టుకుని కూర్చున్నాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangalore school  kindergarten student  ponytail  ponytail kid  bangalore school  

Other Articles