Allow me to die peacefully for my caste says mudragada padmanabham

Mudragada and his wife begins hunger strike

mudragada hunger strike, mudragada padmanabham, kapu reservation stir, kapu garjana, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

Kapu caste leader Mudragada padmanbham warned state government to fullfill election promises, or allow me to die peacefully for my caste

ITEMVIDEOS:నా జాతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్దం: ముద్రగడ

Posted: 06/09/2016 09:48 AM IST
Mudragada and his wife begins hunger strike

కాపు జాతా కోసం తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానని, ఎలాంటి త్యాగానికైనా తాను సిద్దమని, కాపుల సంక్షేమం కోసం తుది వరకు పోరాటం చేస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు ఆయనతో పాటు తన సతీమణితో అమరణ దీక్షకు పూనుకున్నారు. తనపై సానుభూతి కోసం కాపు కులస్థులు ఎవరూ కిర్లంపూడిలోని తన నివాసానికి రావద్దని సూచించారు. ఎక్కడి వారు అక్కడే తన దీక్షకు సంఘీభావం తెలపాలని ఆయన హితువు పలికారు.

కాపు కులస్థులను వెనుకబడిన తరగతులలో చేర్చుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారని.. అయన అబద్దాలతో కాలం వెల్లబుచ్చుతున్నారని మండిపడ్డారు. గతంలో దీక్షకు పూనుకున్న తనను బీసీలలో చేర్చుతామని విరమింపజేశారన్నారు. దీక్ష నేపథ్యంలో తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. తనను అరెస్టు చేసి జైళ్లో పెట్టినా.. తన దీక్ష కోనఃసాగుతుందన్నారు. ఇంట్లో అయితే నీళ్లు తాగే వాడిని, జైల్లో అయితే అవి కూడా ముట్టనని తెల్చిచెప్పారు.

 

తుని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను బేషరుతుగా ఉపసంహరించాలని, అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి వరకు తన దీక్ష కోనసాగిస్తానని చెప్పారు. రైలు దహనం కేసులో అమాయకులను అరెస్టు చేసి, వారిపై రౌడీలు, గుండాలు అన్న ముద్ర కూడా వేస్తున్నారని మండిపడ్డారు. గత దీక్ష విరమణ నేపథ్యంలో రైలు దహన కేసులన్నింటీనీ ఉపసంహరిస్తామని చంద్రబాబు హామి ఇచ్చి అరెస్టుల పర్వాన్ని చేపట్టడం ఆయన దమన నీతికి నిదర్శనమన్నారు.

కాపు గర్జన సభకు వచ్చిన వారిని అరెస్టు చేసి జైల్లో పెడితే వారిని రక్షించడం తమ బాధ్యతని అయనన్నారు. వారిని విడుదల చేయాలన్న డిమాండ్ తో అమలాపురం పోలిస్ స్టేషన్ కు వెళ్లి తనను అరెస్టు చేయాలని చెబితే కేసులు లేవన్న పోలీసులు తనను ఇంటివద్ద దింపేశారన్నారు. అయితే తాజాగా మాత్రం తనపై 69 కేసులు పెట్టారని సమాచారం అందుతుందని చెప్పారు. ఉద్యమ నేతపై 69 కేసులు పెట్టిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కుతుందని ముద్రగడ అన్నారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padma nabham  chandrababu naidu  kapu leaders  hunger strike  

Other Articles