టికెట్ లేదంటూ రేప్ చేసిన టీసీ | TTE arrested for raping woman in train

Tte arrested for raping woman in train

Ala Hazrat Express, TTE rape, TC rape, TC ravi meena, passenger raped, jaipur train rape case, తాజావార్తలు, ట్రైన్ లో రేప్, టీసీ రేప్, ప్రయాణికురాలిపై టీసీ రేప్, latest news, telugu news

TTE arrested for raping woman in train. police arrested ravi meena.

టికెట్ లేదంటూ రేప్ చేసిన టీసీ

Posted: 06/04/2016 03:44 PM IST
Tte arrested for raping woman in train

దేశంలో మహిళలకు భద్రత ఎక్కడుంది? నడిరోడ్డుపై, బస్సులో, రైళ్లలో, కార్లలో ఇలా ఎక్కడపడితే అక్కడా నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడాళ్లపై ఆరాచకాలు జరిగిపోతున్నాయి. చట్టాలను ఎంత కఠినతరం చేస్తున్న అఘాయిత్యాలను నిలువరించలేకపోతున్నాం. తాజాగా రైళ్లో ప్రయాణికురాలిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ టీసీ. ఇంట్లో చిన్నపాటి గొడవకు అలిగి పుట్టింటికి వెళ్తున్న మహిళపై మృగంలా రెచ్చిపోయాడు. బాధితురాలు గమ్యస్థానానికి చేరుకుని ధైర్యం చేసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బాధిత యువతి (20 ఏళ్లు) భర్తతో గొడవపడి హజ్రత్ ఎక్స్ ప్రెస్ లో పుట్టింటికి బయలుదేరింది. చేతిలో పైసా లేకపోవటంతో టికెట్ తీయకుండానే రైలు ఎక్కేసింది. ట్రైన్ హపూర్ రాగానే టీటీఈ రవి మీనా చెకింగ్ కోసం ఎక్కాడు. ఆమె టికెట్ తీయలేదని గుర్తించి, ఫైన్ అన్నాడు. డబ్బులు లేవని ఆమె బ్రతిమాలగా, ఇక్కడే ఉంటే కేసు అవుతుందంటూ తనతో రమ్మని సూచించాడు. వెంట వెళ్లిన ఆమెను ఖాళీగా ఉన్న సెకండ్ క్లాస్ ఏసీ భోగీలోకి తీసుకెళ్లి రెండు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఎవరికైనా చెబితే కేసు నమోదు చేస్తానంటూ బెదిరించాడు. ఏం చేయలేని ఆమె ఉండిపోయింది. మే 30న జైపూర్ చేరుకున్న అనంతరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఘజియాబాద్ పోలీసులు, రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గతంలో రవిపై ఇలాంటి ఆరోపణలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ala Hazrat Express  TTE rape  TC rape  TC ravi meena  passenger raped  

Other Articles