సోమిరెడ్డి కౌంటర్ సరిపోయిందేమో! | somireddy solid counter to jagan over comments on babu

Somireddy solid counter to jagan over comments on babu

somireddy chandramohan reddy, TDP, jagan, slipper slap comments, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టడీపీ, జగన్, జగన్ చెప్పు కామెంట్లు, latest news, telugu news, AP news

somireddy chandra mohan reddy solid counter to jagan. jagan should be learn manners as opposition leader he says.

సోమిరెడ్డి కౌంటర్ సరిపోయిందేమో!

Posted: 06/04/2016 10:02 AM IST
Somireddy solid counter to jagan over comments on babu

రాజకీయ నేతల మధ్య మాటల తుటాలు ఎలా పేలినా... మరీ శృతి మించకూడదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన ఓ వ్యక్తి పైగా ప్రస్తుత సీఎంను పట్టుకుని చెప్పుతో కోట్టాలంటూ ప్రజలకు పిలుపునివ్వటం మాట్లాడటం మరీ దారుణం. ఇలాంటి చిల్లర మాటలు మాట్లడటానికి జగన్మోహన్ రెడ్డి ఓ గల్లీ నేత కాదు, ప్రతిపక్ష నేత పైగా ఉన్నత చదువులు చదివుకున్నాడు. వైఎస్ లాంటి రాజకీయవేత్త దగ్గరి నుంచి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి పోరాటం చేయాలే తప్ప, సహనం కోల్పోయి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయన విచక్షణకే వదిలేద్దాం. కానీ, ప్రజలు వదిలినా ప్ర్యతర్థులు వదలరు కదా, ఆయన వ్యవహారశైలిపై మండిపడుతూనే ఉన్నారు.

టీడీపీ సీనియర్లు ఒక్కోక్కరుగా ఆయన వైఖరిని ఖండిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాస్త ఎక్కువ మోతాదులో ఫైరయ్యాడు. జగన్ తోపాటు ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ ను కలుపుకుని మరీ తిట్ల దండకం వల్లించాడు. సరిగ్గా పెంచకపోవటం వల్లే జగన్ ఇలా తయారయ్యాడంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతేనా ఆయన వ్యవహారశైలి భరించలేని వైఎస్ బెంగళూర్ పంపించేశాడంటూ చెప్పుకోచ్చాడు. ఆర్థిక నేరాల్లో ఏ1 నిందితుడిగా ఉన్న నువ్వా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేదంటూ ఆగ్రహాం వ్యక్తంచేశాడు. విచారణ పూర్తయ్యాక తెలుస్తుంది జనాలు ఎవరిని చెప్పులతో కొడ్తారో తెలుస్తుందంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : somireddy chandramohan reddy  TDP  jagan  slipper slap comments  

Other Articles