IndiGo offers flight tickets starting Rs 829 for domestic flyers

All inclusive air tickets at rs 829 as indigo joins fare war

indigo, ticket, flight, airline, discount, sale, spicejet, delhi, airasia, bengaluru, chennai, chandigarh, spice jet, jet airways, air asia, go air, trujet, Jet Airways, IndiGo discount offer

After IndiGo offered tickets at an all-inclusive fare of Rs 806 on certain domestic routes few days back, now it has rolled out yet another offer.

చౌకధర యుద్దంలోకి ఇండిగో ఎయిర్ వేస్.. రూ.809లకే ప్రయాణం..

Posted: 06/04/2016 07:34 AM IST
All inclusive air tickets at rs 829 as indigo joins fare war

లీన్ సీజన్లో అత్యధిక మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి తమ ఎయిర్ వేస్ ను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువెళ్లేందుకు వివిధ ఎయిర్ వేస్ తమ ప్రణాలికను ప్రకటిస్తున్నారు. విమానయాన ప్రయాణాలకు మొగ్గు చూపని ప్రయాణికుల ఈ సీజన్ లో అధికం. అందుకనే విమానయానం అంటే తెలియని ప్రయాణికులను అకర్షించేందుకు విమానయాన సంస్థలు బంపర్ ఆఫర్లు, డిస్కోంట్ లు ప్రకటిస్తుంటాయి. సరిగ్గా అలాంటి చౌక ధర యుద్దంలోకి ఇటీవల అనేక సంస్థలు చేరగా, తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా ఈ పోరులో చేరింది.

అన్ని పన్నులు కలుపుకొని రూ. 829 నుంచి స్వదేశీ విమాన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్వదేశంలో చేసే విమాన ప్రయానాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ స్కీంలో  ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో మాత్రం ఇండిగో ప్రకటించలేదు. అన్నింటికంటే తక్కువగా ఇంఫాల్-గువాహటి మార్గంలో టికెట్ రూ. 829కి అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అయితే ఇతర రూట్లలో మాత్రం టికెట్ల ధరలు దానికంటే కొంత ఎక్కువగానే ఉన్నాయి.

ఢిల్లీ-ముంబై మార్గంలో రూ. 2,486, ఢిల్లీ -చెన్నై మార్గంలో రూ. 3,338 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. అయితే ఇండిగో వెబ్‌సైట్‌లో చూస్తే మాత్రం ఢిల్లీ-ముంబై మార్గంలో వచ్చే వారానికి టికెట్ రూ. 5వేలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఆఫర్ ఎప్పటినుంచి అమలవుతుందో ఇంకా స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఇప్పటికే గో ఎయిర్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఏషియా లాంటి అనేక సంస్థలు వర్షాకాలం ఆఫర్లను ప్రకటించాయి. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కూడా తాజా ఆపర్ తో ప్రయాణికులను అకట్టకుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indigo  ticket  flight  airline  discount  sale  spicejet  delhi  

Other Articles