వయస్సు 60... అది మాత్రం 62 అడుగులు | An indian old man breaks longest hair record

An indian old man breaks longest hair record

Savjibhai Rathwa, world longest hair, Guinness World Record, జుట్టుతో గిన్నిస్ రికార్డు, సావిభాయ్ రత్వా, latest news, entertainment, latest news

An Indian man with 62-foot long hair has said he is applying to be recognized by the Guinness World Records. A video filmed in a village in Surendranagar, Gujarat, shows Savjibhai Rathwa unspooling his dreadlock-like coil of hair that he has been growing out for decades.

వయస్సు 60... అది మాత్రం 62 అడుగులు

Posted: 06/03/2016 06:37 PM IST
An indian old man breaks longest hair record

పెంచింతే పోయేదేముంది మహా అయితే రికార్డుల్లోకి ఎక్కడం తప్ప అనుకున్నాడేమో! ఒక వృద్ధుడు ఏకంగా 62 అడుగుల జుట్టను పెంచేశాడు. అంతేనా ఆ శిరోజాలతో ఏకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కేశాడు. ఇంతకీ ఆ పెద్దాయన ఏ ప్రాంతానికి చెందినవాడో కాదు మనదేశంవాడే.

గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లాలోని ఓ కుగ్రామానికి సావిభాయి రత్వా వయస్సు 60 ఏళ్లు. కానీ, జుట్టును దశాబ్దాలుగా  పెంచుకుంటూ పోసాగాడు. అది ఏకంగా ఇప్పుడు 62 అడుగులు పెరిగి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. అసలు రికార్డుల కోసం ఆయన ఇలా చేయలేదంట. జుట్టు అంటే తనకు చిన్ననప్పటి నుంచి ఎంతో ప్రాణమని, అందుకే అలా పెంచుకుంటూ పోయానని అంటున్నాడు. ఇందుకోసం ప్ర్యతేక డైట్ ను కూడా ఫాలో అయ్యాడంట. ప్రత్యేకించి పండ్లు, కూరగాయాలను ఎక్కువగా తీసుకునేవాడినని చెబుతున్నాడు. రెండురోజులకోకసారి తల స్నానం చేసే ఇతగాడికి దాదాపు మూడు గంటల సమయం పడుతుందట. ఇలా స్నానం తర్వాత ఆ జుట్టును ఆరబెట్టేందుకు మనవళ్లు, మనవరాళ్ల సాయం తీసుకుంటానని ముసిముసి నవ్వులతో చెబుతున్నాడు. కాగా, గతంలో ఈ రికార్డు 22 అడుగుల పొడవు గల కేశాలతో చైనాకు చెందిన జీక్విపింగ్ పేరిట రికార్డు ఉండేది. 2010లో జీక్విపింగ్ చనిపోయే వరకు ఈ రికార్డు అలాగే ఉండిపోయింది. ఇక ఇది ఇప్పుడు మన దేశానికి చెందిన వ్యక్తికి సొంతం అయ్యింది.

బాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Savjibhai Rathwa  world longest hair  Guinness World Record  

Other Articles