ఆ ముఖ్యమంత్రికి దెబ్బ మీద దెబ్బలు | Karnataka CM Siddaramaiah's woes Rs 1.3cr loan from friend

Karnataka cm siddaramaiah s woes rs 1 3cr loan from friend

Siddaramaiah, vivekananda, Bangalore Turf Club, woe money, తాజా వార్తలు, సిద్ధరామయ్య, బెంగళూర్ టర్ఫ్ క్లబ్, వివేకానంద, తెలుగువార్తలు, latest news, telugu news, politics, political news

Beleaguered chief minister Siddaramaiah's woes seem to never end. Now, a sanction has been sought on the grounds of his nominating to the Bangalore Turf Club (BTC) stewardship, a businessman with whom he is said to have had monetary transactions to the tune of Rs 1.3 crore.

ఆ ముఖ్యమంత్రికి దెబ్బ మీద దెబ్బలు

Posted: 06/03/2016 04:45 PM IST
Karnataka cm siddaramaiah s woes rs 1 3cr loan from friend

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ సామెత కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి సరిగ్గా సరిపోతుంది. ఇటీవల ఖరీదైన వాచీ విషయంలో అష్ట కష్టాలు పడటం, అడ్డగోలుగా ఆరోపణలు రావటం, చివరకు అది ప్రభుత్వ ఆస్తి అంటూ స్పీకర్ కు అందజేసి వివాదానికి ముగింపు పలికాడు. అయితే అక్కడితో ఆయన కష్టాలకు బ్రేక్ పడలేదు, మరింత వేగంతో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అధికారాన్ని వాడుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి సాక్ష్యాలతో సహా గవర్నర్ వాజుభాయ్ వాలాకు నివేదిక అందజేశాడు ఓ సామాజిక కార్యకర్త. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఓ వ్యాపార వేత్తను బీటీసీ కు స్టివార్డ్ గా ఎంపిక చేయడమే.

వ్యాపారవేత్త ఆయన ఎల్ వివేకానందను బెంగళూరు టర్ఫ్ క్లబ్(బీటీసీ) కు స్టివార్డ్‌గా నామినేట్ చేయటాన్ని సిద్ధారామయ్య ప్రతిపాదించారు. దీంతో ఆయన్ని అసలు ఏ అర్హత పై నామినేట్ చేశారంటూ భాస్కరన్ అనే వ్యక్తి ప్రశ్నించాడు. ఈ వ్యవహారంలో తాను సేకరించిన అంశాలను మీడియా ముందు ఉంచాడు.  వివాదంగా మారింది. అతని(వివేకానంద)తో సిద్దరామయ్యకు గతంలో లావాదేవీలు ఉన్నాయంటున్నాడు. వివేకానంద నుంచి సీఎం సిద్దరామయ్య రూ.1.3 కోట్ల రుణం తీసుకున్నారని, అందుకు సంబంధించిన పత్రాలను మీడియాకు విడుదల చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన కుటుంబ సభ్యులకుగానీ లేదా ఏదేనీ ఇతర లావాదేవీల కోసం అధికారాన్ని దర్వినియోగం చెయొద్దన్న నిబంధన ఉంది. దాన్ని తుంగలో తొక్కి సిద్ధరామయ్య వ్యవహరించారంటూ భాస్కరన్ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు.

కాగా, వీటిపై వివేకానంద స్పందించాడు. గతంలో తాను టర్ఫ్ క్లబ్ లో సభ్యుడిగా ఉన్నానని, సీఎంతో ఆర్ధిక లావాదేవీలు పెట్టుకున్నాననే వార్తలు అవాస్తవమని చెబుతున్నాడు. అయితే నిరుడు తన స్నేహితుడు (సీఎం సిద్దారామయ్య నుద్దేశించి) ఓ చెక్ తీసుకున్నారని, త్వరలోనే వాటిని తిరిగి ఇచ్చేస్తారని అనుకుంటున్నానటం కొసమెరుపు. గతంలో తాను రెండేళ్ల పాటు మైసూర్ రేస్ క్లబ్ కు చైర్మన్ గా వ్యవహరించానని అనుభస్థుడిని కాబట్టే బీటీసీ స్టివార్డ్‌గా నామినేట్ చేశారని చెప్పుకొచ్చాడు. అంతేకానీ దీనివెనుక ఎలాంటి దురుద్దేశం లేదంటూ చెబుతున్నాడు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె, అధికారుల అవినీతి వంటి సమస్యలతో సతమతమవుతున్న సిద్ధరామయ్యకి వ్యక్తిగతంగా వస్తున్న ఆరోపణలను ఎలా ఎదుర్కోనబోతున్నాడో లెట్ వెయిట్ అండ్ సీ...

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  vivekananda  Bangalore Turf Club  woe money  

Other Articles