Monsoon will arrive in 4-5 days over Kerala coast

Imd predicts excess rainfall

monsoon forecast, monsoon imd, imd monsoon forecast, monsoon kerala, monsoon kerala, rainfall imd, imd rainfall, IMD, rain forecase, excess rainfall, india news

The IMD had said the onset would be delayed by a week, possibly more, and it would now happen around June 7.

రెండో వారంలో పలకరించనున్న తొలకరి..

Posted: 06/03/2016 09:47 AM IST
Imd predicts excess rainfall

నీటి చుక్క కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అన్నదాతను ప్రసన్నం చేసేందుకు వరుణుడు సిద్దమవుతున్నాడు. ఈ నెల 7న ఒకటి రెండు రోజులు అటుఇటుగా కేరళను తాకనున్నాడని, ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలో తెలుగురాష్ట్రాలను పలకరించనున్నాడని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తొలకరి ఎంత తొందరగా పలుకరిస్తే.. తాము అంతే తొందరగా పనులు ప్రారంభిస్తామనే రైతన్నల ముఖాలలో అనందం విరూభూస్తుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని వివరించారు

ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వైపు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. క్యుములోనింబస్ మేఘాల తీవ్రత తగ్గినందున వడ గాలుల తీవ్రత కూడా తగ్గనున్నట్లు వివరించారు. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయని, రాష్ట్రంలో వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్నారు.

కాగా, జూన్ 1వ తేదీనే కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు.. ఆలస్యం కారణంగా అందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవాణాల జాప్యంతో వర్షపాతంలో ఎలాంటి తేడాలు లేవని అన్నారు. ఈ వర్షాకాలంలో సారి సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సారి దేశంలోని వాయువ్య ప్రాంతంలో అధిక వర్షంపాతం కురిసే అవకాశాలు వున్నాయని తెలిపారు. ఈ సారి దేశవ్యాప్తంగా 106 శాతం సాధరణ కన్న అధికాంగా వర్షపాతం నమోదవుతుందని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rains  monsoons  kerala  IMD  rain forecase  excess rainfall  

Other Articles