Wife fails 'virginity test', husband ends marriage in Nashik!

Nashik man ends marriage after wife fails virginity test

virginity, wife, groom, caste panchayat, marriage, bedsheet, nashik, wedding, virginity test, Nashik man, not virgin, Maharashtra, blood stains, ends, husband, Man, marriage, nashik, panchayat,

In a case that has sent shockwaves across Maharashtra, a village caste panchayat in Nashik district has termed a newly married girl as 'not virgin' after her husband told them she had failed the 'virginity test',

తన పెళ్లి చేసుకుంది కన్యను కాదని..

Posted: 06/01/2016 01:23 PM IST
Nashik man ends marriage after wife fails virginity test

శాస్త్రసాంకేతిక రంగాలలో దేశం ముందుకు దూసుకువెళ్తున్నా.. ఇంకా మూఢనమ్మకాలతో కాలం వెల్లుబుచ్చుతున్న వారు లేకపోలేరు. ఆధునిక సమాజంలో అనాగరిక పోకడలు ఇంకా 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో వెలుగుచూస్తే.. మన అవివేకానికి చూసి నవ్వుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాజాగా బయటపడిన ఉదంతం నవనాగరికుల గుడ్డి నమ్మకాలకు అద్దం పడుతోంది. తాను పెళ్లాడిన యువతి కన్య కాదని ఓ భర్త తన భార్యతో వివాహబంధాన్నే తెంచుకునేందుకు సిద్దమయ్యాడు.

వివాహమైన 48 గంటల్లోనే తన వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యాడో భర్త. అతగాడికి ఆ గ్రామ పెద్దలు, కులపెద్దలు మద్దతు పలికారు. కన్యత్వ పరీక్షకు వరుడిని ప్రోత్సహించారు. అదెలా అంటే..? మే 22న పెళ్లిచేసుకున్న వరుడికి కులపెద్దలు తెల్లని దుప్పటి ఇచ్చారు. రెండు రోజుల రోజుల తర్వాత ఈ దుప్పటిని పెళ్లికొడుకు కులపెద్దలకు తిరిగిచ్చేసాడు. దుప్పటిపై రక్తపు మరకలు లేకపోవడంతో తాను పెళ్లి చేసుకున్న యువతి కన్య కాదని అన్నాడు. అమెను తీసుకువచ్చి పుట్టింట్లో వదిలేసాడు.

దీంతో ఆమెతో వివాహ బంధం తెంచుకునేందుకు అతడికి కులపెద్దలు అనుమతిచ్చారు. అయితే అధునిక రోజుల్లో ఇంకా రక్తపు మరకలు చూడటం ఏంటని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మహిళలు సైకిల్ తోక్కినా.. పరుగెత్తినా.. లాంగ్ జంప్, కబడ్డీ లాంటి క్రీడలలో పాల్గన్నా వారికి అందరిలాంటి పరిస్థితిని శోభనం రోజున ఎదుర్కోర్న వాస్తవం తెలియకుండా కులపెద్దలు, గ్రామ పెద్దలు విడాకులకు ప్రోత్సహించడమేంటిని వారు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి తరపున సామాజిక కార్యకర్తలు రంజనా గవాండే, కృష్ణా చందగుడేలు రంగంలోకి దిగి, ఈ విషయం కులపెద్దలకు వివరిస్తామని, సామరస్య పరిష్కారం లభించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virginity test  Nashik man  not virgin  Maharashtra  

Other Articles