Complaint filed against Tamil actor Surya in case of assault

Police case against actor suriya

Tamil Actor Surya, Sivakumar, football player, lenin Imannuael, assault, case, chennai, Tnagar, Chennai youth Surya, Surya, Sivakumar,Tamil actor

A 20 years old football player lodged a police complaint at Shastri Nagar police station against the actor Suriya and claimed that Surya slapped him in Adyar.

అవమానించారని ప్రముఖ హీరోపై పోలీసుల కేసు..

Posted: 05/31/2016 11:56 AM IST
Police case against actor suriya

తమను ప్రముఖ నటుడు అవమానించాడని ఓ యువకుడు పోలీసు కేసు నమోదు చేశారు. కాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సూర్యపై ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు కేసు పెట్టాడు. తిరువికా వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదం విషయంలో జోక్యం చేసుకొని బాధితుడినైన తనతో గొడవపడి చేయిచేసుకున్నాడని ఆ యువకుడు జే5 శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే..  టీ నగర్ లో ఓ బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్న లెనిన్ ఇమాన్యుయెల్(25) అనే వ్యక్తి తన స్నేహితుడు, చెన్నై ఫుట్ బాల్ అసోసియేషన్(సీఎఫ్ఏ) టీంలో ప్రముఖ క్రీడాకారుడు ప్రేమ్ కుమార్ (21)తో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు ఆద్యార్ ప్రాంతం మీదుగా వెళుతున్నారు. అలా వెళుతున్న వారిని దాటేసుకుంటూ అనూహ్యంగా తిరు వి కా వంతెనపై మీదకు ఓ కారు వేగంగా వచ్చి వెంటనే బ్రేక్ వేసింది.

దీంతో వీరి బైక్ కాస్త వెళ్లి ఆమె కారును ఢీకొట్టి  కొంత ధ్వంసం కావడంతోపాటు వారికి గాయాలయ్యాయి. ఆసమయంలో ఆ కారును ఓ మహిళ నడుపుతోంది. నిర్లక్ష్యంగా కారు నడపడమే కాకుండా తమ బైక్ ధ్వంసానికి, గాయాలవడానికి కారణమైన ఆమెను నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆ వైపుగా నటుడు సూర్య వచ్చాడు. సూర్యా నివాసం కూడా ఈ ఆద్యార్ లోని ఉంది. సంఘటన జరిగిన చోటుకు అర కిలో మీటర్ దూరంలో సూర్య ఇల్లు ఉండటం అదే సమయంలో ఆయన కూడా అదే రూట్ లో వచ్చారు.

అయితే, తాము ఆ మహిళను ఎంతో మర్యాద పూర్వకంగా నష్టపరిహారం అడుగుతున్నప్పటికీ సూర్య ఆ విషయంలో జోక్యం చేసుకొని మహిళని వేధిస్తారా అని తిట్టడంతోపాటు ఫుట్ బాల్ క్రీడాకారుడైన తన స్నేహితుడిపై చేయి చేసుకున్నాడని లెనిన్ చెప్పాడు. అసలు విషయం తెలియకుండా సెలబ్రిటీగా వున్న సూర్య.. హీరోలా వచ్చి తమను అవమానించారని, దీంతోనే అయనపై పోలీసు కేసు పెట్టినట్లు చెప్పారు. విషయం తెలుసుకోకుండా సినిమాల్లో హీరోలా.. తమను విలన్లమాదిరిగా చిత్రీకరించిన సూర్య.. మహిళలే ఉత్తములు, పురుషులు దుర్మార్గులన్నట్లు వ్యవహరించారని అరోపించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles