brooklyn beckham love story

Brooklyn beckham love story

brooklyn beckham love story: Chloe Moretz has showed off her new tattoo that she had done with boyfriend Brooklyn.

brooklyn beckham love story: Chloe Moretz has showed off her new tattoo that she had done with boyfriend Brooklyn.

ఓ సెలబ్రెటీ ప్రేమికుడి వింత కథ

Posted: 05/26/2016 05:18 PM IST
Brooklyn beckham love story

ప్రేమలో వుంటే కంటికి ప్రేమించిన వ్యక్తి తప్ప మరెవరూ కనిపించరు. ఇపుడు ఇలాంటి పరిస్థితే ఓ సెలబ్రెటీ కుటుంబంలో కూడా జరుగుతోంది. ఇంగ్లండ్ ఫుట్ బాల్ స్టార్ డేవిడ్ బెక్ హమ్ తనయుడు బ్రూక్లిన్ బెక్ హమ్ ఎవరి మాట వినడం లేదట. తాను ఎలాగైనా అమెరికా వెళ్తానని మారాం చేస్తున్నాడట.

అయితే అమెరికా వెళ్లడానికి అసలు కారణం ఏమిటంటే... బ్రూక్లిన్ ప్రేమించిన అమ్మాయి గ్రేస్ అమెరికాలో వుందట. అందుకే గ్రేస్ కు దగ్గరగా వుండాలనే బ్రూక్లిన్ ఇలా మారాం చేస్తున్నాడని అంటున్నారు అతని స్నేహితులు. అయితే బ్రూక్లిన్ మాత్రం... తనకు యూఎస్ లో ఫోటోగ్రఫితో పాటు నటనలో ఎడ్యుకేషన్ ను కొనసాగిస్తానని, అందుకోసం లాస్ ఏంజిల్స్ లోని ఓ కాలేజ్ లో అడ్మిషన్ కూడా దొరికిందని చెబుతున్నాడు.

కానీ బ్రూక్లిన్ నిర్ణయం పట్ల తన తల్లి విక్టోరియా బెక్ హమ్ అసంతృప్తిగా వున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు కుటుంబంతోనే కలిసి వుండే బ్రూక్లిన్ ను దూరంగా పంపించడం ఆమెకు ఇష్టం లేదట. ఆ చదువు, ట్రైనింగ్ వంటివి ఇక్కడే లండన్ లో వుండి చేసుకోవచ్చుగా అని తల్లి చెబుతోంది. కానీ తాను మాత్రం యూఎస్ కు వెళ్లడానికే డిసైడ్ అయ్యాను అని తల్లికి బ్రూక్లిన్ గట్టిగానే చెప్పేసాడని ఓ బ్రిటన్ మీడియా సంస్థ వెల్లడించింది. మరి బ్రూక్లిన్ అమెరికా వెళ్తాడా లేదా అనే విషయం త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brooklyn beckham  Chloe Grace Moretz  Love Story  

Other Articles