ajay threatens sister in law to write property on his name or else upload nude photos on net

Woman threatened by brother in law to write property on his name

harassments, property, ajay, kukatpally, software engineer, nude films, guntur, attrocities on women, rape on women, harassment on women

brother in law takes nude photos and videos of his sister in law and threatens to write property on his name after raping her or else he will upload them on social media. kukatpallly police registered case and investigating

ఆస్తి కోనం నగ్న చిత్రాల అప్ లోడ్ బెదిరింపులు..

Posted: 05/23/2016 05:40 PM IST
Woman threatened by brother in law to write property on his name

కంటి పాపను కనురెప్పే కాటు వేస్తున్నకలికాలం ఇది. తన వారి మాన ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన మగాడు.. మృగాడిలా మారడు. ఆస్తి తన పేరున రాయకపోతే.. అమెకు సంబంధించిన అత్యాచార ఫోటోలు, న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ.. అనునిత్యం వేధించడంతో అమె సహనం కోల్పోయింది. తనవారు తనకు చెడు చేసినా.. మౌనంగా వున్నా అమె.. ఆలస్యంగా ధైర్యం తెచ్చుకుంది. తనవారైనా నేరం చేస్తే నేరస్థులే అవుతారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను అశ్రయించింది.

తనకు తనవాడైన భావ నుంచి రక్షణ కావాలని కోరింది. మనుషులు, వారి మనసులతో పనిలేకుండా కేవలం ఆస్తులు, అంతస్తులు మాత్రమే సొంతమనుకుని భ్రమల్లో బతికే వాడికి కారగార కటిక చీకట్లను పరిచయం చేసింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో ఓ వ్యక్తి తన మరదలి పేరిట ఉన్న ఆస్తిని తన పేరిట రాయక పోతే నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన అజయ్ ఇటీవలి సొంత మరదలి పేరుతో స్థలం కొన్నాడు. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో.. ఒక్కసారిగా భూమికి ధర పెరిగింది. దీంతో ఆ భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మరదలిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడి, ఫొటోలను తీశాడు. అనంతరం ఎవరికైన చెప్పినా.. ఆస్తి తన పేరిట రాయక పోయినా నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో వేధింపులు భరించలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడికి గతంలోనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివాహం అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harassments  property  ajay  kukatpally  software engineer  nude films  guntur  

Other Articles