ఆ టైంలో రాహుల్ గాంధీ కుక్కలతో.. | playing with his dog instead of paying attention to the people surrounding him

Playing with his dog instead of paying attention to the people surrounding him

AICC, congress, Rahul gandhi, Rahul, Himanta Biswa, రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ఏఐసీసీ, కాంగ్రెస్ పార్టీ, అస్సోం

The Congress, which has been shredded in Assam, a state loyal to it for 15 consecutive years, should not be perturbed by today's result, said Himanta Biswa Sharma, alleging that when he warned Rahul Gandhi two years ago of how badly the party was imploding, the Congress boss responded blithely with a series of "So whats".

ఆ టైంలో రాహుల్ గాంధీ కుక్కలతో..

Posted: 05/20/2016 01:31 PM IST
Playing with his dog instead of paying attention to the people surrounding him

కాంగ్రెస్ భవిష్యత్ నేతగా అనుకుంటున్న రాహుల్ గాంధీ మీద తీవ్ర వ్యాఖ్యాలు చేశారు అస్సాం బిజెపి నాయకుడు, ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు హిమంత్ బిస్వా. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తాకి కుయ్యో మొర్రో అంటుంటే.. హిమంత్ బిస్వా రాహుల్ మీద హాట్ కామెంట్లు చేసి పుండు మీద కారం జల్లారు. రాహుల్ గాంధీ తనను పట్టించుకోలేదని.. కుక్కలతో ఆడుకున్నారని వెల్లడించారు. గతంలో అస్సోం పరిస్థితి మీద రాహుల్ గాంధీకి వివరించడానికి వెళితే.. ఆయన మాత్రం అవి పట్టించుకోకుండా కుక్కలతో ఆడుకున్నారని.. సో వాట్ అని అన్నారని ఆయన వివరించారు.

అస్సోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దిగజారిందని ఇలాగే ఉంటే కనీసం 25సీట్లు కూడా ఈసారి దాటకపోవచ్చని తాను ఒక పక్క చెబుతుండగా అలా కుక్కలతో ఆడుకున్నారని హిమంత్ బిస్వా అన్నారు. రాహుల్.. యజమాని-సేవకుడు విధానాన్ని అనుసరిస్తారని చెప్పారు. ఆరోజు తాను చెప్పిన మాటలు విని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే.. రాహుల్ అయినా మారాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ అన్నా అతడిని మార్చాలి అని ఆయన అన్నారు.గత 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి అదికారం కోల్పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles