this candidate has won with record majority

Kcr appreciates tummala nageshwar rao for record vvitory

paleru by election, tummala nageswar rao, palair by polls, telangana cm kcr, trs win, record victory, bumper majority,

Telangana cm kcr has appreciated minister tummala nageshwar rao for winnig palair assembly by polls with record majarity

‘‘ఆయనది రికార్డు మెజారిటీ.. ఇప్పటివరకు ఎవరికీ రాలేదు..’’

Posted: 05/19/2016 12:51 PM IST
Kcr appreciates tummala nageshwar rao for record vvitory

సమైక్య రాష్ట్రంలోనూ ఉప ఎన్నికల ద్వారా తమ సత్తా చాటిన టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ అదే తరహా విజయాన్ని అందించారు తెలంగాణ ప్రజలు. ప్రత్యేక రాష్ట్రంలో నారయణ ఖేడ్ తరువాత పాలేరులోనూ అక్కడి ఓటర్లు అధికార టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. పాలేరు ఉప ఎన్నిక ఫలితాలలో నియోజకవర్గ రికార్డు మెజార్టీ సాధించిన తెలంగాన మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభినందించారు. తుమ్మలను గెలిపించిన పాలేరు ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే ఇంతకుముందు 1972లో కాంతయ్య 25452 మెజారిటీతో గెలిచారు. ఇంతకుమించి ఎవరికీ మెజారిటీ రాలేదని.. మళ్లీ ఇన్నాళ్లకు తుమ్మల 45వేలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు నిరంతరంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విజయం ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత బాధ్యతను పెంచింది. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలని సూచించారు.

పాలేరు ఉప ఎన్నికలో విజయం తమకు బాధ్యతను పెంచిందని, అయితే విజయగర్వంతో విర్రవీగుతూ ఉబ్బిపోయి అతి ప్రసంగాలు చేయకూడదని కూడా ఆయన కార్యకర్తలను చెప్పారు. మనల్ని గెలిపించిన ప్రజలకు మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తాను ముఖ్యమంత్రి అయిన ఐదో రోజు నుంచి టీఆర్ఎస్ మీద అర్ధసత్యాలు, అసత్యాలతో పసలేని పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఇది సమంజసం కాదన్నారు. మిషన్ కాకతీయాను కమీషన్ కాకతీయగా అభివర్ణించిన విపక్షాలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని కోరుతున్నానని కేసీఆర్ అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paleru by-election  tummala nageswar rao  kcr  trs win  Telangana  

Other Articles