Paresh Rawal pushes aside pesky fan trying to take selfie

Fan wants selfie actor misbehaves with him

paresh rawal, bjp mp, film actor, mumbai airport, selfie, paresh rawal fan, paresh rawal news, paresh rawal mumbai, paresh rawal delhi, paresh rawal fan, paresh rawal arrogant, paresh rawal mumbai airport

Actor-MP Paresh Rawal pushed a fan who wanted to take selfie with him without his permission.

అభిమాని పట్ల బాలీవుడ్ నటుడి కర్కషత్వం..!

Posted: 05/18/2016 08:02 PM IST
Fan wants selfie actor misbehaves with him

ఆయన ఓ విలక్షణ నటుడు, అంతేకాదు తాజాగా రాజకీయాల్లో చేరి బీజేపి తరుపున పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. అయితే ఈ మధ్య అతడు వార్తల్లో నిలవాలనుకుంటున్నాడు కాబోలు. అయితే పాజిటివ్ గా వార్తల్లో వుండటం వల్ల ఎక్కువ ప్రచారం లభించదని తెలిసి నెగిటివ్ ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. నటుడిగా అనుభవం వుంది కాబట్టి.. అంతా అయ్యాక అలా కాదు ఇలా అంటూ, నాలుక కరుచుకున్నట్లు పెద్ద తప్పిదమేదో చేసినట్లు తనకు తాను ఫీలై.. అదే అతని అభిమానులకు కూడా అంటగట్టేలా చూస్తున్నాడు. ఇంతలా ఎవరి గురించి చెబతున్నామా అన్నదే కదా మీ సందేహం. అయనే పరేశ్ రావల్.

ఆ మధ్య పార్లమెంటు సమావేశాలకు సరి బేసి సంఖ్య కార్ల నియమ నిబంధలను ఉల్లంఘించిన ఆయన మొదల్లో అసలు మీడియానే కాదని వెళ్లి ఆనక కాలు కాలిన కోతిలా వచ్చి తాను ఈ నిబంధన వుందని తెలియదని, తాను చేయకూడని తప్పు చేశానని చెప్పుకోచ్చాడు. ఆయనే మళ్లీ ఇలాంటి నెటిగివ్ వార్తతో మళ్లీ వార్తల్లో్ నిలిచారు. ఇటీవల ఆయన ముంబై విమానాశ్రయానికి వచ్చారు. ఆయన ఫోన్‌లో మాట్లాడుతుండగా ఓ అభిమాని చేరువగా వచ్చి రావల్‌ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఇందుకు రావల్‌ సమ్మతి తీసుకోలేదు. తన అనుమతి లేకుండానే తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడంతో అతన్ని రావల్‌ బలంగా అవతలికి తోసేసి వెళ్లిపోయారు.

దీంతో ఆ అభిమానికి దిమ్మదిరిగిపోయింది. ఈ ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి ఒకరు వివరిస్తూ.. 'ఎయిర్‌పోర్టు బయటకు వచ్చిన తర్వాత చాలాసేపు పరేశ్‌ ఒక్కరే నిలబడి ఉన్నారు. ఆయన సీరియస్‌గా కనిపించాడు. తన డ్రైవర్‌ కోసం వెతుకుతున్నట్టు కనిపించింది. తరచూ ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. ఇంతలో ఓ వ్యక్తి ఆయన చేరువగా వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో చికాకు పడ్డ ఆయన ఆ వ్యక్తిని తోసేసి వెళ్లిపోయారు' అని చెప్పాడు. నిజానికి ఎయిర్‌పోర్ట్‌ వంటి బహిరంగ ప్రదేశాల్లో తమ అభిమాన సినీ జనాలు కనిపించినప్పుడు వారితో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడటం కొత్త కాదు. అభిమానులు లేనిదే తాము ఈ స్థాయిలో లేమని చెప్సే హీరోలే వున్న ఈ రోజుల్లో.. ప్రతినాయకుడి పాత్రలో నటించే ఈ నటులు మాత్రం అభిమానుల వద్ద పోజు కోట్టడం ఎంత వరకు సమంజసమో అయనకే తెలియాలి

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paresh Rawal  bjp mp  fan  selfie  mumbai airport  maharastra  

Other Articles