తెలంగాణలో డీఎస్సీ లేదు | there is no DSC in Telangana State

There is no dsc in telangana state

DSC, Teachers, Teachers selection, Telangana, DSC in Telangana, తెలంగాణ, డిఎస్సీ

Telangana govt recently pass a GO on DSC. Teacher posts filling through DSC.But Telangana govt cancel the DSC.

తెలంగాణలో డీఎస్సీ లేదు...

Posted: 05/18/2016 03:40 PM IST
There is no dsc in telangana state

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతిని రాష్ట్ర సర్కారు రద్దు చేసింది.  ఇకపై  ఉపాధ్యాయులను టీఎస్పీఎస్సీ ద్వారా మాత్రమే నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాల విద్య కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య ఉత్తర్వులను జారీచేశారు. పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతి నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, పీఈటీలను ఇన్నాళ్లుగా డీఎస్సీల ద్వారా నియమిస్తుండగా.. ఇకపై టీఎస్‌పీఎస్‌సీ ద్వారా మాత్రమే నియమిస్తారు. ఏకరూపత, స్థిరత్వం, సరైన ఎంపిక పద్ధతుల కోసం ఇవాళ విడుదల చేసిన జీవో నెం. 19(a)&(b)లో తెలిపారు. పాఠశాల విద్య డైరెక్టర్ నియంత్రణలో ఉన్న మోడల్ స్కూళ్లలో ఉన్న ప్రిన్సిపాళ్లు, పీజీ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టులను కూడా టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles