Donald Trump and Bernie Sanders Claim Victories in West Virginia

Bernie sanders takes west virginia as donald trump rolls on

donald trump, hillary clinton, bernie sanders, democratic contestants, republican contestant, west virginia primary, nebraska primary, US elections 2016,US politics,US news,Democrats

Sanders’ victory does little to narrow Clinton’s large delegate lead, while presumptive Republican nominee claims wins in West Virginia and Nebraska

అమెరికాలో పంబరేపుతున్న బెర్నీ సాండర్స్..

Posted: 05/11/2016 12:54 PM IST
Bernie sanders takes west virginia as donald trump rolls on

అమెరికా అధ్యక్ష పదవికోసం నామినీ అభ్యర్థుల మధ్య రేసు అనూహ్యంగా మలుపు తీసుకుంటుంది. ఈ రేసులో ఇప్పటి వరకు వినని పేరు ఇప్పుడిప్పుడే తెరముందుకు వస్తుంది. ఆ పేరే బెర్నీ సాండర్స్. డెమొక్రటిక్ అభ్యర్థి నామినాగా బరిలో నిలిచిన ఈయన ఏకంగా రెట్టింపు వేగంతో పుంజుకుని వస్తున్నారు. తన అనుభవానికి తోడు సమస్యలపై వివరణాత్మక విశ్లేషణలు ఇస్తూ అగ్రరాజ్యవాసుల మనన్నలను అందుకోవడంలో ఆయన ముందున్నారు. అమెరికా ఓటర్లను తన వైపు మలుచుకుంటూ తన అభ్యర్థిత్వాన్ని బలోపేతం చేసుకుంటూ సాండర్స్ పంబరేపుతున్నారు.

దీంతో హిల్లరీ క్లింటన్ రేసులో వుంటారా..? ఓటమితో వైదొలుగుతారా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని డోనాల్డ్ ట్రంప్ ఖరారు చేసుకోగా.. డెమొక్రటిక్ నామినీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మాత్రం ఇంకా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఆమెను తన పార్టీకి చెందిన అభ్యర్థి బెర్నీ సాండర్స్ వెనక్కు నెడుతున్నారు. వెస్ట్ వర్జినీయాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో బెర్నీ సాండర్స్ విజయం సాధించారు. అంతకుముందు ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో కూడా ఆయన క్లింటన్ ను దెబ్బకొట్టారు. దీంతో ఇప్పుడు రేసులో ఇద్దరు సమ ఉజ్జీలుగా ముందుకు వెళ్లినట్లవుతుంది.

ఈ విజయం అనంతరం సాండర్స్ మాట్లాడుతూ మొత్తం 19 రాష్ట్రాల్లో తాము విజయం సాధించినట్లు చెప్పారు. దీంతో తాము అభ్యర్థిత్వ రేసులో సురక్షితంగా ఉన్నట్లయిందని చెప్పారు. చివరి ఓటు వరకు తాను రేసులోనే ఉంటానని ఆయన చెప్పారు. అలాగే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కూడా ఇక్కడ విజయం సాధించారు. వెస్ట్ వర్జినీయాలోని బొగ్గు మైనింగ్ వ్యవహారాలను ఎన్నికల ప్రచారంలో చెప్పడంలో హిల్లరీ క్లింటన్ విఫలమైనట్లు రాజకీయ నిపుణులు చెప్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bernie Sanders  hillary Clinton  West Virginia primary  

Other Articles