Uttarakhand floor test: 'The people are with us, we have their blessings,' says Rawat

Uttarakhand floor test god is with us we will win says harish rawat

uttarakhand, uttarakhand floor test, floor test, floor test live, congress, bjp, harish rawat, congress floor test, uttarakhand assembly, uttarakhand government

The nine rebel Congress MLAs cannot take part in the floor test in the Uttarakhand Assembly.

మరికొన్ని నిమిషాలే ముహూర్తం.. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ

Posted: 05/10/2016 10:45 AM IST
Uttarakhand floor test god is with us we will win says harish rawat

దేవుడు, రాష్ట్ర ప్రజలు తమ వైపున ఉన్నారని, తాము తప్పకుండా బలపరీక్షలో గెలుపొందుతామని ఉత్తరాఖండ్ పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ రాజీకీయాన్ని దగ్గరగా పరిశీలిస్తున్న అందరిలోనూ అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది క్షణాల్లో జరగనున్న బలపరీక్ష సమయంలో ఏయే పార్టీ ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గుతారన్న అంశంలో ఇంకా క్లారిటీ లేని రాష్ట్ర కాంగ్రెస్ గుండెళ్లో రైలు పరిగెడుతున్నాయి. ఇందుకు కారణం నిన్నటి వరకు తమతో పాటుగా వున్న సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే కనిపించకుండా పోవడమే కారణం.

ప్రస్తుత దేశ రాజకీయాల్లో సంచనలంగా మారిన ఉత్తరాఖండ్ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారా..? ఎవరి అరోపణలు ఎమ్మల్యేలు విశ్వసించారు..? అక్కడ జరిగిన స్టింగ్ అపరేషన్ లు ఎందుకు దారితీశాయి..? అన్న వ్యవహారాలన్నింటికీ తెరపడనున్న తరుణంలో అటు రాష్ట్ర ప్రజలతో పాటు ఇటు దేశ ప్రజలు, రాజకీయ నేతలు కూడా అసక్తిగా ఎదురుచూస్తున్నారు.  రావత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేక బీజేపీ వంతా అనే విషయం స్పష్టం కానుంది. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యేలంతా ముస్సోరిలోని ఓ రిసార్ట్‌ లో ఒకే చోట ఉండగా రేఖా ఆర్యా అనే ఎమ్మెల్యే మాత్రం టచ్ లో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో రావత్ కు కాస్త కంగారు మొదలైనట్లు సమాచారం.

ఎక్కడ బీజేపీ తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తుందోనన్న భయంతోనే వారిని ప్రత్యేకంగా రిసార్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖా ఆర్యా మాత్రం తోటి ఎమ్మెల్యేలతో లేకుండా పోయారు. అసలు ఆమె టచ్ లోనే లేకుండా పోయినట్లు చెప్తున్నారు. కానీ, మరో కాంగ్రెస్ నేత శిల్పి అరోరా మాత్రం ఆర్యా కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నారని, ఆమె రావత్ కు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్తున్నారు. ఓ రకంగా నేడు బలపరీక్షలో రావత్  గట్టెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 70 మంది ఉండే ఉత్తరాఖండ్ అసెంబ్లీ బలం 9 మందిపై అనర్హతతో 61కి పడిపోయింది. రావత్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 31 మంది బలం అవసరం. 9 మంది అనర్హులవడంతో 27కు పరిమితమైన కాంగ్రెస్‌కు ఇద్దరు బీఎస్పీ, ఒక యూకేడీ, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తుండడంతో రావత్ కూటమి బలం 33గా ఉంది. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్యా అందుబాటులో లేకుండా పోవడంతో కాస్తంత ఉత్కంఠను తలపించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttarakhand  assembly floor test  congress  bjp  harish rawat  

Other Articles