ప్రమాదంలోనే చనిపోయిన దేవి! | Forensic Reports clear that Devi dead on Accident

Forensic reports clear that devi dead on accident

Devi, Btech Student, Jubulee Hills, Hyderabad, దేవి, హైదరాబాద్, పోలీస్, ఫోరెన్సిక్ రిపోర్ట్

Forecnsic Team reveals the details about Devi death mistory. They report that devi died for Accident only.

ప్రమాదంలోనే చనిపోయిన దేవి!

Posted: 05/07/2016 01:12 PM IST
Forensic reports clear that devi dead on accident

బీటెక్ విద్యార్థిని దేవి రెడ్డి మరణం మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. ఆమె గత ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగి కారు ప్రమాదంలో మరణించినట్టు పోలీసులు తెలిపారు. అయితే తమ కుమార్తె మరణం ప్రమాదం వల్ల జరిగింది కాదని, ఆమెని కారులోనే చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారని దేవి తల్లిదండ్రులు, సోదరి పోలీసులకు ఫిర్యదు చేశారు. దీంతో మళ్లీ విచారణ చేశారు పోలీసులు, ఫోరెన్సిక్ టీం. ఫోరెన్సిక్ టీమ్ తాజాగా ఇచ్చిన నివేదికలో దేవిని హత్య చేసిన ఆనవాళ్లు కనపించలేదని పేర్కొంది. ఆమె ప్రమాదం వల్లే మరణించిందని తెలిపింది.

దేవి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలను ఫోరెన్సిక్ టీమ్ కు పంపించారు పోలీసులు. వారు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చారు. ఇంటికి త్వరగా చేరాలన్న అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చారు. దేవికి, భరత్ సింహారెడ్డి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడని, గత 8నెలలుగా వారిద్దరూ టచ్ లో ఉంటున్నారని తెలిపారు. దేవి, భరత్ కారు గచ్చిబౌలిలోని డిస్ట్రిక్ట్ బీపీఎం పబ్ ఆదివారం తెల్లవారు జామున 3.33 గంటలకు బయల్దేరినట్టు... అక్కడి నుంచి కేవలం 11 నిమిషాల్లోనే జర్నలిస్టు కాలనీకి వచ్చేశారని చెప్పారు. ఓ పత్రికా కార్యలయం సీసీ ఫుటేజీలో వీరి కారు 3.44 గంటలకు దూసుకుపోతున్నట్టు కనిపించింది. దేవి ఇంటి నుంచి ఫోన్లు ఎక్కువగా వస్తుండడంతో మరింత వేగాన్ని పెంచడంతో... కారు అదుపు తప్పి చెట్టును గుద్దేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దేవి తల్లిదండ్రులు మాత్రం కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. తమ ఇళ్లు ఓ రోడ్డులో ఉంటే... మరో రోడ్డులోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles