Delhi police arretsed Sonia Gandhi and Rahul Gandhi

Delhi police arretsed sonia gandhi and rahul gandhi

Sonia Gandhi, Rahul Gandhi, Comgress, Delhi, కాంగ్రెస్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ

Congress Party President Sonia Gandhi, former Prime Minister Manmohan Singh, and Congress Party Vice President Rahul Gandhi today courted arrest while leading senior leaders and thousands of workers from their party in a march from Jantar Mantar towards Parliament Street.

సోనియా, రాహుల్ గాంధీల అరెస్టు, విడుదల

Posted: 05/06/2016 01:16 PM IST
Delhi police arretsed sonia gandhi and rahul gandhi

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. అనంతరం పార్లమెంట్‌కు బయల్దేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో పాటు కాంగ్రెస్ ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఢిల్లీ పోలీసులు, ఎస్పీజీ సెక్యురిటీ అధికారులు కాంగ్రెస్ నేతలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. బారికేడ్లు తొలగించి ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడంతో నిబంధనలు ధిక్కరించారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఈ ర్యాలీలో మరో విశేషం కూడా ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఫోటో మొదటిసారి కాంగ్రెస్ కరపత్రాల్లో కనిపించింది. సేవ్ డెమొక్రసీ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీలో వాద్రా హాజరుకాలేదు.. ఆయన భార్య, సోనియా కుమార్తె అయిన ప్రియాంక మాత్రం వచ్చింది. గాంధీల ఫోటోలు ఉండడం కొత్త కాకపోయినా రాబర్ట్ వాద్రా ఫోటో ప్రతీదానిపై ముద్రించడం చర్చనీయాంశమయ్యింది. తాను రాజకీయాల్లోకొస్తానని రాబర్ట్ వాద్రా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అంతేకాదు, ప్రియాంక సహకారంతో కాకుండా, గాంధీల అల్లుడిగా కాకుండా స్వతంతంత్రంగా పైకి రాగల నేర్పు ఉన్నవాడినని చెప్పుకున్నారు. ఈ దశలో ఆయన ఫోటో దర్శనమివ్వడం ఊహాగానాలకు తావిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాబర్ట్ వాద్రా అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చన్నది ఓ అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles