CBI Special Court prnounce Dasari and naveen Jindal names in Coal scam

Cbi special court prnounce dasari and naveen jindal names in coal scam

CBI, Coal Scam, Dasari Narayan Rao, UPA, CBI Special Court, కోల్ స్కాం, బొగ్గు కుంభకోణం, దాసరి నారాయణ రావు, జిందాల్ స్టీల్స్, జిందాల్ కోల్ అండ్ పవర్ లిమిటెడ్, నవీన్ జిందాల్

CBI Special court order to enquire deeply on coal scam with place in UPA time. Dasari narayana Rao and Naveen Jindal may face troubles in this case.

ఆయనతో కలిసి దాసరి బొగ్గు కుమ్మక్కు

Posted: 04/30/2016 11:40 AM IST
Cbi special court prnounce dasari and naveen jindal names in coal scam

యుపిఎ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం ఇంకా కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును వదలడం లేదు. గతంలో తాను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని. అంతా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే చేశారని తెలిపారు. కానీ సీబీఐ కోర్టు మాత్రం దానిని తిరస్కరిస్తూ.. తాజాగా సీబీఐ సమర్పించిన ఆధారలను పరిశీలించింది. అందులో నాటి మంత్రి దాసరి కావాలనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కు అనుకూలంగా చర్యలకు దిగారని సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. అయితే దీనిపై జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ లిమిటెడ్ ఓనర్ తో పాటుగా దాసరిని, నాటి కొంత మంది ఉన్నతాధికారులను వివిధ సెక్షన్ ల కింద విచారించాలని ఆదేశించింది.

నవీన్ జిందాల్ కు చెందిన కంపెనీలకు బొగ్గు కేటాయింపులు జరిగేలా నాటి జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా పావులుకదిపినట్లు తెలుస్తోంది. బొగ్గు కేటాయింపుల మీద నాటి సిఎస్  ఇచ్చిన నివేదికనుకాదని, మధుకోడా స్వయంగా కొన్ని కంపెనీలను షాట్ అవుట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫైల్ ను కేంద్రానికి పంపగా, కేంద్రంలో ఉన్న దాసరి నారాయణ రావు వాటికి కావాల్సిన కేటాయింపులు జరిగేలా చేశారని తెలుస్తోంది. కాగా ఇందుకు దాదాపు 2 కోట్లు ముట్టినట్లు, వాటిని వివిధ కంపెనీలకు మళ్లించారని కంపెనీ అభిప్రాయపడింది. ఇది ఎంతో ప్రొఫెషనల్ గా చేసిన స్కాం అని కోర్టు అభిప్రాయపడింది. మొత్తానికి చాలా కాలంగా సాగుతున్న బొగ్గు స్కాంలో మరోసారి దాసరి చిక్కుల్లో పడ్డారు.. పడతారు అన్నది మాత్రం క్లీయర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles