Donald Trump Mocks Call Centres In India, But Says The Place Is 'Great'

Donald trump mocks indian accent but calls india a great place

Donald Trump, Call centre, Fake Indian accent, Republican presidential front runner

Republican presidential frontrunner Donald Trump has expressed his displeasure at India's outsourcing industry by impersonating a call centre representative in India.

భారత్ పై మళ్లీ విషం కక్కిన డోనాల్డ్ ట్రంప్

Posted: 04/23/2016 06:30 PM IST
Donald trump mocks indian accent but calls india a great place

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్‌ అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కాడు. ఓవైపు భారత్‌ గొప్ప దేశమని అంటూనే.. మరోవైపు భారతీయుల యాసను ఎద్దేవా చేశాడు. భారత్‌లోని కాల్‌ సెంటర్‌  ఉద్యోగుల యాసను అసభ్యంగా ఇమిటేట్ చేస్తూ ట్రంప్‌ తన దురుసుతనాన్ని ప్రదర్శించాడు. అమెరికా బ్యాంకింగ్‌, క్రెడిట్ కార్డు హబ్‌ అయిన డెలావేర్‌లో ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు. భారత్‌ గొప్ప ప్రదేశమని, ఆ దేశ నేతల పట్ల తనకెలాంటి ఆగ్రహం లేదని ఆయన చెప్పాడు.

కస్టమర్‌ కేర్‌ సేవలు అమెరికా నుంచి అందిస్తున్నారా? లేదా విదేశాల నుంచా అన్నది తెలుసుకోవడానికి ఇటీవల తాను ఓ క్రెడిట్ కార్డు కంపెనీకి ఫోన్‌ చేశానని ఆయన పేర్కొన్నారు. 'ఊహించండి ఎవరు మాట్లాడుతారు. భారత్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్ ఎత్తుతాడు. ఇదెలా పనిచేస్తుంది' అని ట్రంప్ అసహనం వ్యక్తం చేశాడు. 'నా కార్డును చెక్‌ చేసుకుందామనే వంకతో అతనితో మాట్లాడాను. మీది ఎక్కడ? అని అడిగాను.. దానికి 'మేం ఇండియా' నుంచి సమాధానమిచ్చాడు' అంటూ ట్రంప్‌ భారతీయుల ఆంగ్లభాష యాస ఎలా ఉంటుందో అసహనంగా ఇమిటేట్‌ చేసి చూపించాడు. నిజానికి భారతీయుల ఆంగ్ల యాస ఎంతో మెరుగ్గా ఉంటుంది. కానీ ట్రంప్‌ మాత్రం తనకు తోచినరీతిలో బూటకమైన యాసతో మాట్లాడాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles