Woman used Periscope to live stream alleged rape of 17-year-old friend

Teen girl indicted for live streaming rape on periscope

18-year-old woman, social media app, livestream, rape, rape and kidnapping, Ohio prosecutor, Franklin County, Prosecutor Ron O’Brien, Marina Lonina, Raymond Gates, nudity-oriented material, Periscope app, livestream the rape, abuducting, kidnaping charges, indictment, sexual assault, rape, grand jury, livestream, periscope

An 18-year-old woman who used a social media app to livestream the alleged rape of her 17-year-old friend was indicted along with another man by a grand jury on several charges including rape and kidnapping, an Ohio prosecutor

అత్యాచారం.. ప్రత్యక్ష ప్రసారం.. జీవితాంతం కారాగారవాసం..

Posted: 04/14/2016 01:53 PM IST
Teen girl indicted for live streaming rape on periscope

స్నేహానికి అర్థమే మారింపోయింది, అర్థాన్ని మార్చేసింది. ఎలాంటి కల్మశాలు లేకుండా ఒకరికోకరు, ఒకరి కోసం మరోకరు అంటూ సాగాల్సిన స్నేహానుబంధం బీటాలు వారింది. తన మిత్రుడి చేత తన స్నేహితురాలని అత్యాచారం చేయించడమే కాకుండా.. దానిని ప్రత్యక్ష ప్రసారం చేసింది, తన స్నేహితురాలి పరువును బజారు పాలు చేసింది. నిజానికి ఇలాంటి అత్యాచారాలు జరిగితే తన ప్రాణాలను అడ్డుపెట్టి తన స్నేహితురాలిపై జరుగుతున్న లైంగిక దాడిని నిరోధించాల్సిన మిత్రురాలు.. కుట్రతో, కుతంత్రంతో తానే స్నేహితురాలిని బజారున పడేసింది, చివరకు జీవితాంతం కరాగారవాసం చేయాల్సిన అవసరం ఏర్పడింది,

స్నేహానికి పరాకాష్టగా నిలిచేలా వున్న ఈ ఘటన యూఎస్ లోని ఓహియోలో చోటుచేసుకుంది, దీంతో సోషల్ మీడియా (ఫేస్ బుక్)లో అందుబాటులోకి వచ్చిన యాప్ 'పెరిస్కోప్' పై కూడా విమర్శలు వస్తున్నాయి. 17 ఏళ్ల యువతిపై తన స్నేహితుడు అత్యాచారం చేస్తుంటే, మొత్తం ఘటనను లైవ్ లో పంచుకున్న 18 ఏళ్ల టీనేజ్ యువతి జీవితం దాదాపు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాంక్లిన్ కౌంటీ ప్రాసిక్యూటర్ రాన్ ఓబ్రియన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మరీనా లోనినా (18), 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి, 29 ఏళ్ల రేమాండ్ గేట్స్ ఒకే వీధిలో ఉంటూ స్నేహంగా ఉండేవారు.

గత నెల 27న అమ్మాయిపై రేమాండ్ అత్యాచారం చేస్తుంటే, లోనినా ఆ దృశ్యాలను పెరిస్కోప్ సహాయంతో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీన్ని చూసిన వారి మిత్రుడు ఒకరు పోలీసులకు సమాచారం చేరవేశాడు.దీంతో లోనినా, గేట్స్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు పెట్టారు. వీరిపై అత్యాచారం, కిడ్నాప్, లైంగిక వేధింపులు, మైనర్ బాలికపై కామవాంఛ తీర్చుకోవడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టగా, ఇద్దరికీ 40 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ఓబ్రియన్ వెల్లడించారు. దీంతో తాను చేసిన ఘోరమైన పనికి జీవిత చరమాంకం వరకూ లోనినా కటకటాల మధ్యనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abuducting  kidnaping charges  indictment  sexual assault  rape  grand jury  livestream  periscope  

Other Articles