HC orders IPL matches to be shifted out of Maharastra from April 30

Bombay high court orders ipl out of parched maharashtra

bcci, indian premier league, IPL matches, IPL matches out of maharastra, parched maharastra, bombay high court division bench, Justice V.M. Kanade, Justice M.S. Karnik, bombay high court, drought in maharashtra, sports, cricket

The court has given the BCCI and organisers of IPL matches 18 days time to look for new venues from parched maharastra

బిసీసీఐకు షాక్.. మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ ఔట్..

Posted: 04/14/2016 11:38 AM IST
Bombay high court orders ipl out of parched maharashtra

బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తీవ్రమైన కరువుతో అతలాకుతలమైన మహారాష్ట్ర రైతులను ప్రభుత్వాలు అదుకోకుండా, కేవలం ఆట కోసం లక్షల లీటర్ల నీటిని వినియోగించడంపై బొంబే హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది, కరువు, నీటి కొరత కారణంగా మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని ఆదేశించింది. ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఆ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత మహారాష్టలోని వాంఖేడ్, నాగపూర్, ఫూణే, ముంబై స్టేడియంలలో జరగాల్సిన అన్ని మ్యాచ్లనూ రాష్ట్రం నుంచి తరలించాలని బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామని, రోజు 40 లక్షల లీటర్ల కంటే ఎక్కువ నీటిని లాతూర్ లేదా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తామని బీసీసీఐ తరపు న్యాయవాది అంతకుముందు కోర్టుకు విన్నవించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, పుణె చెరో 5 కోట్లు రూపాయల చొప్పున సీఎం సహాయక నిధికి అందజేస్తాయని చెప్పారు. వాదనలు విన్న అనంతరం ఆరు మ్యాచ్ల నిర్వహణకు మాత్రమే కోర్టు అనుమతిచ్చింది.

మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్పూర్ వేదికల్లో మ్యాచ్లు జరగాల్సివుంది. దీంతో ఏప్రిల్ 30 లోపు మహారష్ట్ర వేదికగా కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే ఆ రాష్ట్రంలో నిర్వహించనున్నారు. హైకోర్టు తాజా ఉత్తర్వుల కారణంగా మరో 13 మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మహారష్ట్రకు రావాల్సిన కోట్ల రూపాయల అధాయం హరించుకుపోనుంది, అయితే కోర్టు తీర్పు పట్ల రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి, మ్యాచ్ లకు వినియోగించే నీటిని రైతులు సాగుకు వినియోగిస్తారని రైతు సంఘాల నేతలు పేర్కోన్నారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL matches  Maharashtra  Bombay High Court  

Other Articles