Wife of slain NIA officer Tanzil Ahmed dies at AIIMS 9 days after attack

Nia officer tanzil ahmed s wife farzana dies

Bijnor,lucknow,Murder,National Investigation Agency (NIA), NIA officer’s murder case, Farzana, personal enmity, Mohammad Tanzil Ahmed, Tanzil Ahmad, Uttar Pradesh police, Uttar Pradesh

Slain NIA officer Tanzil Ahmed’s wife succumbed to injuries on Wednesday at New Delhi’s AIIMS, nine days after she was shot at along with her husband in Uttar Pradesh’s Bijnor.

ఎన్ఐఎ అధికారి తంజిల్ అహ్మద్ సతి మృతి.. అనాధలైన పిల్లలు..

Posted: 04/13/2016 06:49 PM IST
Nia officer tanzil ahmed s wife farzana dies

భారత్ లోనేకాక పాకిస్థాన్ లోనూ సంచలనం కలిగించిన ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్య ఘటనలో తీవ్ర గాయాలపాలైన అస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సతీమణి పర్జానా అహ్మద్ అస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు, ఉత్తరప్రదేశ్లో ఈ నెల 3 తేదీన తంజిల్ అహ్మద్పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తంజిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన సతీమణి తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు,

ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్, పర్జానా అహ్మద్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే ఇన్నాళ్లు తల్లిదండ్రుల సమక్షంలో హాయిగా పెరిగిన వీరు.. వారిద్దరి మరణంతో అనాధలయ్యారు. ఒక్కసారిగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఈ పిల్లల పరిస్థితిని చూసిన బంధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగారు, స్వగ్రామం సాహస్ పూర్ లో తంజీల్ హాజరైన వివాహవేడుకకు హాజరైన తిరిగి వస్తున్న అహ్మద్ కుటుంబాన్ని ఇద్దరు వ్యక్తులు వెంబడించి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాగా తంజిల్ అహ్మద్ హత్యకేసులో వ్యక్తిగత విరోధానికి సంబంధించిన అంశలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Tanzil Ahmed  Tanzil Ahmad  Farzana  Uttar Pradesh police  Uttar Pradesh  

Other Articles